ప్రతినెలా ఉచితంగా పశువులకు గర్భకోశ వ్యాధి నివారణ శిబిరాలు

జిల్లాలో ప్రతినెలా పశువులకు గర్భ కోశ వ్యాధి చికిత్స శిబిరాలను ఉచితంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా పశు వైద్యాధికారి సింహారావు అన్నారు.

Update: 2024-02-07 11:58 GMT

దిశ, కామారెడ్డి : జిల్లాలో ప్రతినెలా పశువులకు గర్భ కోశ వ్యాధి చికిత్స శిబిరాలను ఉచితంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా పశు వైద్యాధికారి సింహారావు అన్నారు. రాష్ట్ర పశు గణ అభివృద్ధి సంస్థ వారి ఆర్థిక సహకారంతో జిల్లా పశుగణాభివృద్ధి సంఘం నిజామాబాద్, పశుసంవర్ధక శాఖ కామారెడ్డి, విజయ డెయిరీ పాలకేంద్రం ఆధ్వర్యంలో కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 6వ వార్డు సరంపల్లిలో ఉచిత గర్భకోశ వ్యాధి శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.

    సదస్సులో జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ సింహారావు మాట్లాడారు. పశువుల్లో వచ్చే గర్భకోశ వ్యాధి నివారణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై ప్రతి నెలా అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సరంపల్లి విజయ డెయిరీ పాలకేంద్రం అధ్యక్షులు ఆకుల రవికుమార్, మాజీ సర్పంచ్ మామిండ్ల నాగయ్య, ఉత్తమ రైతు నాగరాజు, రైతు మారుతి, గోపాలమిత్ర సూపర్వైజర్ కృష్ణ, బాలు, బాబా గౌడ్, శ్రీనివాస్, విజయ డైరీ పాలకేంద్రం సెక్రెటరీ గోపాల్, లింగయ్య, నర్సింలు, రైతులు పాల్గొన్నారు.


Similar News