కాంగ్రెస్‌లోకి మాజీ ఎమ్మెల్సీ డి.రాజేశ్వర్

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ డి. రాజేశ్వర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Update: 2024-02-24 09:52 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ డి. రాజేశ్వర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి , పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిని రాజేశ్వర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు రేవంత్ రెడ్డి పార్టీలోకి స్వాగతం పలికారు. నిజామాబాద్ నగరానికి చెందిన డి రాజేశ్వర్ కాంగ్రెస్ కార్యకర్తగా మున్సిపల్ కౌన్సిలర్ గా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన టువంటి కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి చేరారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ అనుచరుడిగా రాజేశ్వరరావుకు పేరు ఉంది. జుక్కల్ నియోజకవర్గం నుంచి ఒకసారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. వైఎస్ జమానాలో రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేశారు. వైయస్ అండతో ఎమ్మెల్సీ పదవిని దక్కించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్‌ఏస్‌లో చేరారు. బీఆర్ఎస్ పార్టీలో క్రిస్టియన్ మైనారిటీ కోటాలో రెండోసారి ఎమ్మెల్సీగా అవకాశం దక్కించుకున్నారు. గడచిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎమ్మెల్సీ పదవిని పొడిగిస్తారని ఆశపడిన రాజేశ్వరరావుకు నిరాశ మిగిలింది. జుక్కల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని యోచన చేసిన కేసీఆర్ పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలోనే మళ్లీ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ కూడా పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని సీట్లలో గెలిచేందుకు ఎందుకు ఇతర పార్టీ లీడర్లను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్న విషయం తెలిసిందే.


Similar News