బీఆర్ఎస్ పార్టీ సమావేశాలకు మాజీ ఎఎంసీ ఛైర్మన్ దూరంగా ఎందుకున్నారో తెలుసా..
పిట్లం మండలం టీఆర్ఎస్ పార్టీలో వర్గ విభేదాలతో మాజీ మార్కెట్ కమిటి చైర్మన్ సమావేశాలకు దూరంగా ఉంటునట్లు సమాచారం.
దిశ, పిట్లం : పిట్లం మండలం బీఆర్ఎస్ పార్టీలో వర్గ విభేదాలతో మాజీ మార్కెట్ కమిటి చైర్మన్ సమావేశాలకు దూరంగా ఉంటునట్లు సమాచారం. 8 సంవత్సరాలుగా చురుకైన పాత్ర పోషిస్తూ తనదైన శైలిలో కార్యకర్తలను వెంట వేసుకోని ఇదివరకు పార్టీ సమావేశాలుకు హాజరయ్యేవారు. కానీ గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ పార్టీ సమావేశాలకు ఆహ్వానం రావటం లేదా ? ఆయనే రావటం లేదా ? అన్న ప్రశ్నలకు సమాధానం లేకుండా పోతుంది. మాజీ ఎఎంసీ ఛైర్మన్ క్రిష్ణారెడ్డి వంశపారంపర్యంగా తన తండ్రి వెంకట రామారెడ్డి సర్పంచ్ గా చేసిన సేవలు ఎన్నో ఉన్నవి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఉన్నప్పుడు బుడగ జంగాలకు జిల్లాలో మొట్టమొదటి సారిగా పక్కాఇళ్ళు నిర్మించి కాలనీ ఏర్పాటు చేశారు. గిరిజనులకు మండల కేంద్రం నడిబొడ్డున తులసీరాంకాలనీ, ఎస్సీలకు కూడా పక్కా ఇళ్ళు నిర్మించి కాలనీ ఏర్పాటు చేశారు.
అలాగే నిరుపేదలకు ఇళ్ళ స్థలాలు కేటాయించి గృహ నిర్మాణాలకు రాజీవ్ గాంధీ కాలనీ ఏర్పాటు చేశారు. వెంకటరామారెడ్డి శైలిలో మరెవరూ రాజకీయాలకి రారేమో అనుకున్న తరునంలో ఆయన తనయుడు. క్రిష్ణారెడ్డి (బాబు దొర) రాజకీయ రంగ ప్రవేశం చేశారు. రాజకీయంగా తండ్రి చేసిన సేవలను గుర్తుంచుకోని ప్రజలకు ఎదో చేద్దాం అనుకున్న సమయంలో అప్పటి ఎంఎల్సీ రాజేశ్వర్ ఆయనకు మార్కెట్ కమిటీ ఛైర్మన్ పదవి కట్టబెట్టారు. హైదరాబాద్లో న్యాయవాద వృత్తిలో స్థిరపడిన అతను స్వగ్రామం పిట్లంకు వచ్చి సేవలు చేపట్టారు. ఈ క్రమంలో హరిజనుల శ్మాశాన వాటికకై సుమారు ఆర ఎకరం భూమిని బహుహరించారు.
లాగే సరస్వతి శిశు మందిర్ జాతీయ రహదారు నుండి పాఠశాలకు వెళ్ళడానికి లక్షల రూపాయల విలువ చేసే తన సొంత భూమిని రోడ్ వేయించి ఇచ్చారు. ప్రజలకు మరింత సేవలు చేసే విధంగా దగ్గర కావాలని అనుకున్న తరునంలో పిట్లం మార్కెట్ కమిటీ జనరల్, మహిళలకు రిజర్వు కావటంతో ఆ పదవి ఆశించి తన చిరకాల సుపరిచితుడైన రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంతరెడ్డిని ఆశ్రయించారు. కానీ ఆ పదవిని ఎంఎల్ఎ షిండే వేరేవారికి కట్టబట్టడంతో మనస్థాపం చెంది పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయనకు పిట్లం, నిజాంసాగర్ మండలాలలో చాలా పరిచయాలు, బంధువర్గం ఉంది. ఇలాంటి తరుణంలో రాబోయే రోజుల్లో ఎం జరుగబోతుందని ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు. మార్కెట్ కమిటీ పదవి రాకపోవడంతో అతని చూపు వే పార్టీ మారే విధంగా భావిస్తున్నారని సమాచారం తెలిసింది.