పిల్లల చావుకు కారణమైన తల్లికి ఐదేళ్ల జైలు

క్షణికావేశంలో భర్తతో గొడవ పడి పిల్లలను కాలువలో తోసేసి తాను ఆత్మహత్యాయత్నం చేసిన ఘటనలో ఇద్దరు పిల్లల చావుకు కారణమైన తల్లికి న్యాయస్థానం జైలు శిక్ష విధించింది.

Update: 2024-03-18 14:24 GMT

దిశ, ప్రతినిధి, నిజామాబాద్ : క్షణికావేశంలో భర్తతో గొడవ పడి పిల్లలను కాలువలో తోసేసి తాను ఆత్మహత్యాయత్నం చేసిన ఘటనలో ఇద్దరు పిల్లల చావుకు కారణమైన తల్లికి న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. సోమవారం నిజామాబాద్ జిల్లా సెషన్స్ న్యాయమూర్తి సునీత కుంచాల ఈ మేరకు తీర్పు వెలువరించారు. నందిపేట్ కు చెందిన అమత , భర్త శ్రీనివాస్ మధ్య తరుచు ఆర్థిక కారణాలతో గొడవలు జరుగుతుండేవి.

2023లో ఫిబ్రవరి 28న భర్త శ్రీనివాస్ తో గొడవ పడిన అమత తన ఇద్దరు పిల్లలు మను శ్రీయ (2), మను తేజ (ఆరు నెలలు) వయస్సు గల పిల్లలను తీసుకుని ఇంటి నుంచి బయటకు వచ్చింది. స్థానికంగా నందిపేట్ లోని గుత్ప ఎత్తిపోతల కెనాల వద్ద తన ఇద్దరు పిల్లలను కాలువలో తోసేసి తాను కూడా కాలువలో దూకింది. అక్కడే ఉన్న కొందరు తల్లి అమతను కాపాడగా ప్రవాహానికి ఇద్దరు పిల్లలు నీటిలో మునిగి చనిపోయారు.

నందిపేట్ పోలీసులు కేసు నమోదు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఈ కేసులో జిల్లా న్యాయమూర్తి సునీత కుంచాల తన తీర్పులో ఇద్దరు పిల్లల మరణానికి కారణమైన తల్లికి 5 సంవత్సరాల జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. జరిమానా చెల్లించని యేడల ఆరు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని తీర్పు చెప్పారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ రవిరాజ్ తెలిపారు.


Similar News