కామారెడ్డి పాస్ పోర్టు కార్యాలయంలో అగ్ని ప్రమాదం.. కాలి బూడిదైన కంప్యూటర్లు, ఫైల్స్

కామారెడ్డి నడిబొడ్డున నిజాంసాగర్ చౌరస్తాలో ఉన్న ప్రధాన తపాలా కార్యాలయ ఆవరణలో ఉన్న పాస్ పోర్టు ఈ సేవా కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగింది.

Update: 2024-02-24 03:56 GMT

దిశ, కామారెడ్డి: కామారెడ్డి నడిబొడ్డున నిజాంసాగర్ చౌరస్తాలో ఉన్న ప్రధాన తపాలా కార్యాలయ ఆవరణలో ఉన్న పాస్ పోర్టు ఈ సేవా కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో కార్యాలయంలో పెద్దఎత్తున ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. పోస్టాఫీస్ పాత కార్యాలయంలోనే పాస్ పోర్టు ఈ సేవా కేంద్రం కొనసాగుతోంది. కార్యాలయంలో ఉన్న ముఖ్యమైన ఫైల్స్, కంప్యూటర్లు, ఆఫీస్‌లో ఉన్న కాగితాలకు మంటలు అంటుకుని పెద్దఎత్తున చెలరేగినట్టుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో కార్యాలయంలో ఉన్న కొన్ని పత్రాలు, ఫైల్స్ కాలిపోయాయి. ప్రధాన రహదారి పక్కనే కార్యాలయం ఉండటంతో స్థానికులు గమనించి పోలీసులు, ఫైర్ సిబ్బందికి సమాచారమిచ్చారు.

ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్ సహాయంతో సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం సంభవించి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ప్రమాదానికి గురైన కార్యాలయంలో మధ్య గదిలోనే మంటలు వ్యాపించాయి. అటు ఇటు వైపు ఉన్న గధుల్లోకి మంటలు చేరలేదు. ఆ గదుల్లో కంప్యూటర్లు, ముఖ్యమైన ఫైల్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది మంటలు అర్పుతున్నారు. ప్రమాదానికి సంబంధించిన కారణాలు తెలియాల్సి ఉంది.


Similar News