రైతులు వ్యవసాయంతో పాటు చేపల పెంపకం చేపట్టి లాభాలు సాధించాలి

రైతులు వ్యవసాయంతో పాటు చేపల పెంపకం చేపట్టి లాభాలు సాధించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు.

Update: 2024-02-29 11:36 GMT

దిశ, కామారెడ్డి : రైతులు వ్యవసాయంతో పాటు చేపల పెంపకం చేపట్టి లాభాలు సాధించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. రామారెడ్డి మండలం పోసానిపేటలో మహిళ రైతులక్ష్మి తన పొలంలో పిష్ పాండ్ ఏర్పాటుచేసి చేపల పెంపకం చేపట్టారు. ఈ ఫిష్ పాండ్ ను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి మాట్లాడారు.

     రైతులు వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలైన పాడి పశువులు, చేపల పెంపకం చేపట్టి ఆదాయాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. మహిళలు ఆర్థిక పరిపుష్టిని సాధించాలని కోరారు. రైతు లక్ష్మి చేపల పెంపకానికి పెట్టిన పెట్టుబడి వివరాలు, వచ్చిన ఆదాయం వివరాలను తెలియజేశారు. చేపల పెంపకంలో తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. కార్యక్రమంలో డీఆర్డీవో చందర్, ఎంపీడీఓ సవిత రెడ్డి, డీపీఎం రమేష్ బాబు, ఏపీఎం ప్రసన్నకుమార్, సమన్వయకర్తలు దుర్గా దాస్, ప్రతాప్, భూమేష్, వివో ఏలు పాల్గొన్నారు. 

Similar News