రైతులకు వెంటనే పరిహారం అందజేయాలి

కామారెడ్డి మండలంలో శనివారం సాయంత్రం కురిసిన వడగండ్ల వర్షానికి దెబ్బతిన్న మొక్కజొన్న, వరి, కూరగాయల పంటలను కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆదివారం పరిశీలించారు.

Update: 2024-03-17 10:58 GMT

దిశ, కామారెడ్డి : కామారెడ్డి మండలంలో శనివారం సాయంత్రం కురిసిన వడగండ్ల వర్షానికి దెబ్బతిన్న మొక్కజొన్న, వరి, కూరగాయల పంటలను కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆదివారం పరిశీలించారు. మండలంలోని తిమ్మకపల్లి, చిన్న మల్లారెడ్డి, కొట్టాలపల్లి, నరసన్నపల్లి గ్రామాల్లో వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు.

     ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పడగళ్ల వర్షానికి 90 శాతానికి పైగా పంటకు దెబ్బతిన్నాయని, దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. వెంటనే ప్రభుత్వం బాధిత రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే వ్యవసాయ శాఖ అధికారులు పంట నష్టం అంచనా వేసి ప్రభుత్వానికి నివేదికలు పంపించాలని సూచించారు. ప్రభుత్వం నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు.


Similar News