చిట్టెడు భగవంత రెడ్డికి కడసారి వీడ్కోలు..
అశేష జనవాహిని అశ్రునయనాల మధ్య మార్కెట్ కమిటీ చైర్మన్ చిట్టెడి భగవంత రెడ్డి అంత్యక్రియలు కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం అంతంపల్లి గ్రామంలోబుధవారం జరిగాయి.
దిశ, భిక్కనూరు : అశేష జనవాహిని అశ్రునయనాల మధ్య మార్కెట్ కమిటీ చైర్మన్ చిట్టెడి భగవంత రెడ్డి అంత్యక్రియలు కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం అంతంపల్లి గ్రామంలోబుధవారం జరిగాయి. అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్న విషయం విధితమే. ఈ మేరకు ప్రభుత్వ విప్ కామరెడ్డి శాసనసభ్యులు గంప గోవర్ధన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎం కే ముజీ బొద్దిన్ భగవంత రెడ్డి గ్రామంలోని ఆయన ఇంటికి చేరుకొని పార్టీవ దేహం పై పూలమాలలు వేసి నివాళులర్పించారు. భగవంత రెడ్డి ఆకస్మిక మృతి పట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
భాజభజంత్రీలు అశేష జనావాహిని అశ్రునయనాల మధ్య అంతిమయాత్ర కొనసాగింది. ఈ యాత్రలో విప్ గంపతోపాటు బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు పాల్గొని కడసారి వీడ్కోలు పలికారు. గ్రామంలోని స్మశాన వాటికలో అంత్యక్రియలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అధ్యక్షులు జాంగారి గాల్ రెడ్డి, కామారెడ్డి ఎంపీపీ అధ్యక్షులు పిప్పిరి ఆంజనేయులు, బీఆర్ఎస్ పార్టీ కామారెడ్డి శాఖ జూకంటి ప్రభాకర్ రెడ్డి, రాజంపేట బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బిక్కాజీ బలవంతరావు, ఆర్బీఎస్ చైర్మన్ బోండ్ల రామచంద్రం, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మద్ది చంద్రకాంత్ రెడ్డి, సర్పంచుల ఫోరం కన్వీనర్ చిట్టెడి మధుమోహన్ రెడ్డి, అంతంపల్లి సొసైటీ చైర్మన్ వలకొండ వెంకటరెడ్డి, సంజీవరెడ్డి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.