గర్భిణుల్లో రక్తహీనత రాకుండా వైద్యులు చర్యలు తీసుకోవాలి

గర్భిణుల్లో రక్తహీనత సమస్య రాకుండా వైద్య అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు.

Update: 2024-03-01 14:32 GMT

దిశ, కామారెడ్డి : గర్భిణుల్లో రక్తహీనత సమస్య రాకుండా వైద్య అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయం నుంచి జిల్లా డీఎం అండ్ హెచ్ ఓ, వైద్యాధికారులతో జూమ్ మీటింగ్ ద్వారా ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. గర్భిణుల నమోదు క్రమం తప్పకుండా చేపట్టాలని తెలిపారు. రక్తహీనత సమస్యతో గర్భిణులకు సమస్యలు వస్తే వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. గ్రామస్థాయిలో

     బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులను గుర్తించి వారికి మందులు అందించాలని కోరారు. రాష్ట్రీయ బాల సంరక్షణ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని అన్ని పాఠశాలల్లో, అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థులకు పరీక్షలు చేసి ఆరోగ్య రికార్డులను నమోదు చేయాలని సూచించారు. ఈ నెల 3న నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. 0-5 ఏళ్లలోపు పిల్లలందరికీ చుక్కల మందు వేయించి 100 శాతం లక్ష్యాన్ని పూర్తి చేయాలని కోరారు. జూమ్ సమావేశంలో డీఎం అండ్ హెచ్ ఓ లక్ష్మణ్ సింగ్, డిప్యూటీ డీఎంహెచ్వోలు శోభారాణి, చంద్రశేఖర్, వైద్యాధికారులు పాల్గొన్నారు.

Similar News