ఇందూరులో శివాజీ లాంటి మోడీ కావాలా.. ఔరంగజేబు లాంటి రాహుల్ కావాలా

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో జరిగే ఎన్నికల్లో పార్లమెంట్ పరిధి ఓటర్లు ఒక విషయం గమనించాలని ఎంపీ అరవింద్ అన్నారు.

Update: 2024-02-21 10:37 GMT

దిశ, నిజామాబాద్ సిటీ : వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో జరిగే ఎన్నికల్లో పార్లమెంట్ పరిధి ఓటర్లు ఒక విషయం గమనించాలని ఎంపీ అరవింద్ అన్నారు. పార్లమెంట్ పరిధిలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో శివాజీ లాంటి మోడీ కావాలో.. లేదా ఔరంగజేబు లాంటి రాహుల్ గాంధీ కావాలా తేల్చుకోవాలని పేర్కొన్నారు. నిజామాబాద్ నగరంలోని ఆరవ డివిజన్ పరిధిలో ప్రముఖ పారిశ్రామిక సామాజిక సంఘసంస్కర్త లక్కం భూమేష్ ఆధ్వర్యంలో భారీగా ఆయన అనుచరులు బీజేపీలో చేరారు. లక్కం భూమేష్ కు ఎంపీ అరవింద్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు నెలల కాంగ్రెస్ పాలనలో ఏం అభివృద్ధి సాధించిందని

     ఆయన కాంగ్రెస్ పార్టీ నేతలను ప్రశ్నించారు. అసత్యపు ప్రచారాలు చేస్తూ రాజకీయ పబ్బం గడుపుతున్నారని అన్నారు. నిజామాబాద్ ప్రజలకు శివాజీ లాంటి ప్రధాని నరేంద్ర మోడీ పాలన కావాలని, ఔరంగాజేబు లాంటి రాహుల్ గాంధీ వద్దని ఆయన అన్నారు. శివాజీ జయంతి వేడుకలను గ్రామాల్లో యువత స్వేచ్ఛగా జరుపుకునే పరిస్థితి ఈ సంవత్సరం నెలకొందని అన్నారు. శివాజీ జయంతి వేడుకలను అడ్డుకునే విధంగా పోలీస్ వారిని ఏర్పాటు చేశారని ఆరోపించారు. దేశవ్యాప్తంగా బీజేపీకి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలందరూ బీజేపీకి ఓటు వేసి దేశ రక్షణలో బాధ్యులు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్త మాట్లాడుతూ దేశంలో ప్రధాని మోడీ నాయకత్వంలో అనేక అంగళ్లు అభివృద్ధి చెందాయని అన్నారు.

     చారిత్రాత్మకమైన హిందూ బంధువులందరూ ఎదురుచూసే అయోధ్య రామ మందిరాన్ని పునః ప్రారంభించి వారి మనోభావాలను గౌరవించేందుకు పనిచేసిన గొప్ప నాయకుడు ప్రధాని మోడీ అని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని అఖండ విజయంతో గెలిపించి ఆశీర్వదించాలని కోరారు. అదేవిధంగా నూతనంగా పార్టీలో చేరిన లక్కం భూమేష్ మాట్లాడుతూ తాను బీజేపీలో చేరడానికి కారణం దేశంలో భద్రత ఉంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా లక్కం భూమేష్ ఆధ్వర్యంలో 200 మందికి ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్త లు కండువాలు కప్పి ఆహ్వానించారు. 


Similar News