దసరాకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ.. ఎమ్మెల్యే మదన్ మోహన్

ఎల్లారెడ్డి నియోజక వర్గంలోని, మూడు మండలాల్లోని లబ్దిదారులకు, కల్యాణలక్ష్మి, చెక్కుల పంపిణీ చేశారు.

Update: 2024-09-26 16:26 GMT

దిశ, ఎల్లారెడ్డి : ఎల్లారెడ్డి నియోజక వర్గంలోని, మూడు మండలాల్లోని లబ్దిదారులకు, కల్యాణలక్ష్మి, చెక్కుల పంపిణీ చేశారు. ఎల్లారెడ్డి 50, నాగిరెడ్డిపేట 16, లింగంపెట్ 22, కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసినట్లు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరు సంతోషంగా ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన విధంగా ఆరు గ్యారెంటీ సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తుందని అన్నారు. రైతు రుణమాఫీతో రాష్ట్రంలోని రైతులకు ఎంతో మేలు కలిగిందని అన్నారు. త్వరలో రైతులకు రైతు భరోసా కూడా వచ్చే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు.

ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ప్రజలందరూ వ్యవసాయం మీద ఆధారపడి బ్రతుకుతున్న బ్రతుకులు అని అన్నారు. అర్ధాంతరంగా ఆగిన ఎల్లారెడ్డి బస్టాండ్ కు నిధులు లేక ఆగిపోయిన పనులను త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి అని అన్నారు. గరీబొల్లకు ఇండ్లు లేవని డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పనులు ఆగడంతో నిధులు మంజూరు చేయించి, పనులు పూర్తి దశకు చేరుకుంది అని అన్నారు. దసరా పండగ రోజు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ ప్రారంభిస్తామని తెలిపారు. ఎల్లారెడ్డి బస్టాండ్ నిర్మాణం పనులకు 2.5 కోట్ల రూపాయల నిధులు కేటాయించి పనులు ప్రారంభం వేగవంతంగా కొనసాగిస్తామని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కురుమ సాయిబాబా, ఎల్లారెడ్డి, ఆర్డీవో, ప్రభాకర్, మాజీ మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ, ఎల్లారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వెంకట్ రాంరెడ్డి, మాజీ జెడ్పీటీసీ, సామేల్, గాయజోధిన్, సర్పంచులు ఎంపీటీసీలు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, హజార్ ఖాద్రి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వినోద్ గౌడ్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


Similar News