దిశ ఎఫెక్ట్...ఏకలవ్య మోడల్ స్కూల్ ను తనిఖీ చేసిన అధికారులు

దిశలో మంగళవారం ప్రచురితమైన విద్యార్థినులకు అస్వస్థత అనే శీర్షిక కథనానికి అధికారులు స్పందించారు.

Update: 2024-03-19 15:12 GMT

దిశ, గాంధారి : దిశలో మంగళవారం ప్రచురితమైన విద్యార్థినులకు అస్వస్థత అనే శీర్షిక కథనానికి అధికారులు స్పందించారు. మంగళవారం కామారెడ్డి జిల్లా ఆహార నాణ్యత అధికారి సునీత తనిఖీ చేశారు. వివరాల్లోకి వెళితే కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని ఏకలవ్య మోడల్ స్కూల్ లో విద్యార్థులు అస్వస్థకు గురి కావడంతో వివరాలను తెలుసుకునేందుకు

    జిల్లా ఆహార నాణ్యత అధికారి సునీతతో పాటు మండల తహసీల్దార్ సతీష్ వేరువేరుగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ భోజనశాల, వంటగది, స్టోర్ రూమ్ లో ఉన్న స్టాక్ వివరాలను పాఠశాల ప్రిన్సిపాల్ ను అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా వంట సామాగ్రి కి వినియోగించే కూరగాయలు ఎక్కడి నుండి తీసుకొస్తున్నారని, రోజులపాటు నిల్వ ఉంచుతున్నారా అని ఆరా తీశారు. కొన్ని వంట సామాగ్రి, పదార్థాల నమూనాలను సేకరించి తీసుకెళ్లారు.

బుధవారం మెడికల్ క్యాంప్..

విద్యార్థులు అస్వస్థకు గురవడంతో బుధవారం అధికారుల ఆదేశాల మేరకు ఏకలవ్య మోడల్ స్కూల్ లో విద్యార్థులందరికీ బుధవారం రోజు హెల్త్ చెకప్ ఉంటుందని ఏకలవ్య మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ సెవ్ల తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ పిల్లల్లో ఉన్న భయాన్ని తొలగించడానికి శిబిరం ఏర్పాటు చేసినట్టు తెలిపారు.  


Similar News