కలెక్టరేట్ ఎదుట మున్సిపల్ కార్మికుల ధర్నా

కామారెడ్డి కలెక్టరేట్ ఎదుట మున్సిపల్ కార్మికులు ధర్నా నిర్వహించారు.

Update: 2024-02-05 12:01 GMT

దిశ,కామారెడ్డి : కామారెడ్డి కలెక్టరేట్ ఎదుట మున్సిపల్ కార్మికులు ధర్నా నిర్వహించారు. తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) పిలుపులో భాగంగా కామారెడ్డి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి కలెక్టర్ కార్యాలయ ఏవో కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి రాజనర్సు మాట్లాడుతూ... మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, పక్క రాష్ట్రంలో ఇస్తున్న విధంగా వేతనాలు ఇవ్వాలని కోరారు.

     సీఐటీయూ జిల్లా కన్వీనర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ... గత ప్రభుత్వం కార్మికులకు కనీస వేతనాలు కానీ, వారి హక్కులను కానీ పట్టించుకోలేదన్నారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి మున్సిపల్ అధ్యక్ష, కార్యదర్శులు ఎండీ. మహబూబ్ అలీ, ప్రభాకర్, దీపక్, దీవెన, నడిపి నర్సవ్వ, ఎర్రోళ్ల నరసవ్వ, వీరయ్య, బాన్సువాడ అధ్యక్ష, కార్యదర్శులు బుజ్జిగాడు, సాయిలు, మ్యాథరి రాజయ్య, శివరాజు, సాయిలు, రాజేష్, కాశీరాం, రాజకుమార్, విట్టల్, కామవ్వ, ఎల్లారెడ్డి మున్సిపల్ అధ్యక్షుడు చంద్రయ్య, విజేందర్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.


Similar News