మోదీ హయాంలో రైల్వేల అభివృద్ధి: ఎంపీ అర్వింద్

అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా సోమవారం బోధన్ రైల్వే ఆర్వోబీ నిర్మాణ పనులను భారత ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ పద్దతిలో ప్రారంభించారు.

Update: 2024-02-26 13:05 GMT

దిశ, ప్రతినిధి, నిజామాబాద్ : అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా సోమవారం బోధన్ రైల్వే ఆర్వోబీ నిర్మాణ పనులను భారత ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ పద్దతిలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి , బోధన్ మున్సిపల్ చైర్ పర్సన్ తూము పద్మ ,శరత్ రెడ్డి లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ… దేశంలో ప్రధాని మోడీ హయాంలో రైల్వే లు వేగంగా ఆధునీకరణ చెందుతున్నాయని, దీనిలో భాగంగా 41 వేల కోట్లతో దేశవ్యాప్తంగా 500 రైల్వే స్టేషన్ లు 1500 కు పైగా రైల్వే ఆర్వోబీ, అండర్ పాస్ ల , నిర్మాణానికి ప్రధాని శంకుస్థాపన చేశారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో జిల్లాలో రైల్వే ఆర్వోబీ లు ఇప్పటికే కొన్ని పూర్తి చేసుకున్నామని, మాధవ్ నగర్ ఆర్వోబీ త్వరలో పూర్తి చేసుకుంటామని అన్నారు.

వీటితో పాటు 137 కోట్ల తో అర్సపల్లి రైల్వే ఆర్వోబీ పనులు ప్రారంభించామని, ఇప్పుడు బోధన్​ లో ప్రారంభించామని తెలిపారు. మరోదఫా లో ఎడపల్లి, నవీపేట్ ఆర్వోబి పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. రాయలసీమ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ త్వరలో ప్రారంభం కానున్నాయని, బోధన్ బీదర్ రైల్వే పనులు పూర్తి అయితే బోధన్ జంక్షన్ గా రూపుదిద్దుకుంటుందని తెలిపారు. ఈ సందర్భంగా వికసిత్ భారత్ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు ప్రశంస పత్రాలు, బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మెడపాటి ప్రకాష్ రెడ్డి, శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు తాహెర్ బిన్ హుందాన్, శరత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Similar News