వడగళ్ల వానకు నేలమట్టమైన పంటలు

ఉమ్మడి మండలంలో శనివారం సాయంత్రం అకస్మాత్తుగా కురిసిన వడగళ్ల వానతో జొన్న, మొక్కజొన్న, వరి, పొద్దు తిరుగుడు పంటకు భారీగా నష్టం వాటిల్లిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Update: 2024-03-17 12:52 GMT

దిశ,మద్నూర్ : ఉమ్మడి మండలంలో శనివారం సాయంత్రం అకస్మాత్తుగా కురిసిన వడగళ్ల వానతో జొన్న, మొక్కజొన్న, వరి, పొద్దు తిరుగుడు పంటకు భారీగా నష్టం వాటిల్లిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చేతికి వచ్చిన పంటలకు వడగళ్ల వాన భారీగా నష్టం కలిగించిందన్నారు. ఇలాంటి వర్షాలు మూడు నాలుగు రోజులపాటు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలపడంతో ఆకాశంలో మబ్బులను చూసి వడగళ్ల వాన ఎప్పుడు కురుస్తుందో, ఎలాంటి నష్టం కలిగిస్తుందోనని రైతులు హడలెత్తిపోతున్నారు. వడగళ్ల వానతో నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నారు.


Similar News