ఎన్నికలు ఏవైనా కాంగ్రెస్​ గెలుపు ఖాయం

పార్లమెంట్ ఎన్నికలే కాదు పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైనా కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు.

Update: 2024-02-29 11:20 GMT

దిశ,నిజాంసాగర్ : పార్లమెంట్ ఎన్నికలే కాదు పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైనా కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు. దశాబ్ద కాలంగా జుక్కల్ నియోజకవర్గానికి, జహీరాబాద్ పార్లమెంట్ పట్టుకున్న పెతందారులు, చీడపురుగుల పీడ అసెంబ్లీ ఎన్నికల్లో వైదొల్గిందన్నారు. గురువారం మండలంలోని జక్కాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆంజనేయ స్వామి గుడిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ, విజయోత్సవ సభ కార్యక్రమానికి ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారన్నారు.

    200 యూనిట్ల లోపు ఉచిత కరెంట్, రూ. 500 గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ముఖ్యమంత్రి, మంత్రులు లాంఛనంగా ప్రారంభించారన్నారు. ఆర్టీసీ బస్సులో మహిళ ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం వంటి పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాయని చెప్పారు. నిరుద్యోగ సమస్యను తీర్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెగా డీఎస్సీ ప్రకటించారని, అర్హత కలిగిన నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఓట్ల కోసం గ్రామాల్లోకి వచ్చే బి ఆర్ ఎస్, బీజేపీ నేతలను నిలదీయాలని ఆయన అన్నారు. మాజీ సర్పంచ్ బంజ కంశవ్వ బసప్ప ఎమ్మెల్యేకు భారీ ఫొటోను బహూకరించారు.

    ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ చీకోటి జయప్రద, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, మాజీ మండల వైస్ ఎంపీపీ మల్లికార్జున్, బంజ కంశవ్వ, బసప్ప, అనీస్ పటేల్, మారెడ్డి వెంకట్ రెడ్డి, మారెడ్డి అశోక్ రెడ్డి, గజ్జల రాములు, రామకృష్ణ, ప్రజా పండరి, రమేష్ యాదవ్, కృష్ణారెడ్డి, వీరారెడ్డి, సాతేలి సంగయ్య, సాతేలి రాములు, సాతేలి గంగారం, మహేందర్ రెడ్డి, బ్రహ్మానంద రెడ్డి, కాశీరాం, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.


Similar News