రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటుంది

అకాల వర్షానికి పంట నష్టపోయిన రైతులను కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఆదుకుంటుందని, మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి హామీ ఇచ్చారు.

Update: 2024-03-17 10:08 GMT

దిశ,బోధన్ : అకాల వర్షానికి పంట నష్టపోయిన రైతులను కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఆదుకుంటుందని, మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి హామీ ఇచ్చారు. శనివారం రాత్రి కురిసిన అకాల వర్షానికి నేలకొరిగిన పంటలను ఆదివారం బోధన్,సాలూర మండలాలల్లోని నాగంపల్లి, జాడి, సాలురా క్యాంప్, కొప్పర్తి క్యాంప్, ఎడపల్లి మండలం పలు గ్రామాలలో అకాల వర్షానికి నేలకొరిగిన పంటలను స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. సత్వరమే వ్యవసాయ అధికారులు పంట నష్టంను అంచనా వేసి నివేదికలను త్వరితగతిన ప్రభుత్వానికి పంపించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. నిర్లక్ష్యం వహించకుండా తక్షణమే రైతులకు నష్టపరిహారం అందించే విధంగా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

     బీఆర్ఎస్ ప్రభుత్వం కో-ఆపరేటివ్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వలన ప్రస్తుతం రైతులు ఇబ్బందులకు గురి అవుతున్నారని, రైతులకు పూర్తిస్థాయిలో న్యాయం జరిగే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. పంట ఇన్సూరెన్స్ విషయంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని, మాజీ సీఎం కేసీఆర్,కేటీఆర్,హరీష్ రావులకు రైతుల ఉసురు తాకుతుందని ఎమ్మెల్యే విమర్శించారు. రైతులను అన్ని విధాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటుందని, రైతులు అధైర్య పడవద్దని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. రైతులు పంట ఇన్సూరెన్స్ ను తప్పనిసరిగా చెల్లించుకుని ముందస్తు జాగ్రత్తలను వహించాలని సూచించారు.

    ఈ విషయంపై కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకునే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి చేర్చుతామని ఎమ్మెల్యే అన్నారు. నకిలీ విత్తనాలు విక్రయించే కంపెనీలపై చర్యలు తీసుకోవడంతో పాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రైతులు నష్టపోతే కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ అందాన్, పీసీసీ డెలికేట్ గంగా శంకర్, కౌన్సిలర్ శరత్ రెడ్డి, సీనియర్ నాయకులు అల్లె రమేష్, మందర్న రవి, చీల శంకర్, రవీందర్ రెడ్డి, కొప్పర్తి సతీష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు, వ్యవసాయ అధికారులు తదితరులు ఉన్నారు. 


Similar News