భూములు గుంజుకునే అవసరం సీఎం కేసీఆర్ కు లేదు
భూములు గుంజుకోవాల్సిన అవసరం సీఎం కేసీఆర్ కు లేదని, అనవసరంగా కాంగ్రెస్, బీజేపీలు తప్పుడు ప్రచారాలు చేయడం మానాలని ప్రభుత్వ విప్, కామారెడ్డి శాసనసభ్యులు గంప గోవర్ధన్ హితవు పలికారు.
దిశ, భిక్కనూరు : భూములు గుంజుకోవాల్సిన అవసరం సీఎం కేసీఆర్ కు లేదని, అనవసరంగా కాంగ్రెస్, బీజేపీలు తప్పుడు ప్రచారాలు చేయడం మానాలని ప్రభుత్వ విప్, కామారెడ్డి శాసనసభ్యులు గంప గోవర్ధన్ హితవు పలికారు. కామారెడ్డి అసెంబ్లీ నియోజవర్గ స్థానం నుంచి పోటీ చేస్తున్న సీఎం కేసీఆర్ తరఫున గురువారం కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం బస్వాపూర్, భాగర్తి పల్లి, ఇసన్న పల్లి, గ్రామాలలో రోడ్డు షోలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తొమ్మిదిన్నర సంవత్సరాల పాలనలో ఒక్క గుంట భూమి ఎక్కడైనా గుంజుకున్నాడా అని ప్రశ్నించారు. తప్పుడు ప్రచారం చేస్తూ లబ్ధి పొందాలని చూస్తున్న కాంగ్రెస్, బీజేపీలకు ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. లేనిపోని విమర్శలు చేయడం మాని గ్రామాల్లో ఉండే బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఒకసారి ఆలోచించి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని గుర్తించి, తమ ప్రభుత్వానికి మద్దతు పలకాలన్నారు. పొదుపు సంఘాల మహిళలకు పావలా వడ్డీ వచ్చింది బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి వల్ల కాదని, సీఎం కేసీఆర్ మహిళలు ఆర్థికంగా
ఇబ్బందులకు గురవుతున్నారన్న ఉద్దేశంతోనే మార్చి మాసంలో పావలా వడ్డీ విడుదల చేశాడన్నారు. రాజకీయ జన్మనిచ్చిన బస్వాపూర్ గ్రామానికి చెడ్డ పేరు తీసుకొచ్చే పని ఎన్నటికీ చేయబోనని స్పష్టం చేశారు. మీ ఆశీర్వాదం వల్లే తాను ఈ స్థాయికి ఎదిగానన్న విషయాన్ని మరిచిపోనన్నారు. సీఎం కేసీఆర్ ను భారీ మెజార్టీతో గెలిపిస్తే, బీ ఆర్ఎస్ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తరువాత నియోజకవర్గం, రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి చెందుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అధ్యక్షులు జాంగారి గాల్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ పెద్ద బచ్చ గారి నర్సింహారెడ్డి, ఆలయ పునర్నిర్మాణ కమిటీ చైర్మన్ అందె మహేందర్ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ లింగాల కిష్టా గౌడ్, వైస్ ఎంపీపీ గుడిసె యాదగిరి, సొసైటీ చైర్మన్లు నాగర్తి భూంరెడ్డి, బాలగోని రాజా గౌడ్, సర్పంచులు మల్లేష్ మంజుల మల్లారెడ్డి, నాగ లక్ష్మీ స్వామి, గుడిసె రాములు, ఎంపీటీసీ సభ్యులు కాసాల లీలావతి బాలా గౌడ్, ఎస్సీ సెల్ కన్వీనర్ తుడుం స్వామి, రైతుబంధు సేవా సమితి చైర్మన్ మల్లేష్ మల్లారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పురాం రాజమౌళి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు బుర్రి గోపాల్, బద్దం రాకేష్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షులు బుర్రి రంజిత్ వర్మ, గ్రామ బీ ఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అమరావతి సిద్ధ రాంరెడ్డి, గ్రామ ఉపసర్పంచ్ రామగళ్ల భిక్షపతి, ముదాం అరుణ్ కుమార్, దాసరి గోపాల్ రెడ్డి, కందడి రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.