నిజామాబాద్ మున్సిపల్ బడ్జెట్ సమావేశంలో గందరగోళం

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ ప్రారంభంలోనే రసాభాసాగా మారింది.

Update: 2024-02-22 06:37 GMT

దిశ, నిజామాబాద్ సిటీ: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ ప్రారంభంలోనే రసాభాసాగా మారింది. బడ్జెట్ సమావేశం గురువారం నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయంలో దండు నీతి కిరణ్ అధ్యక్షతన నిర్వహించగా.. బీజేపీ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారయణ, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. గత ప్రభుత్వంలో మున్సిపల్ బడ్జెట్ సమావేశాలకు కావాలని జీవో.. తీసుకువచ్చి మీడియాను సమావేశంలోకి అనుమతించలేదని, ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చినందున మీడియాను బడ్జెట్ సమావేశంలోకి అనుమతించి, అక్కడ ఏం చర్చ జరుగుతుందో ప్రజలకు తెరవాల్సిన అవసరం ఉందని కార్పొరేటర్లు పట్టుబట్టారు.

ఒక దశలో సభ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని జీహెచ్ఎంసి ఇతర మున్సిపల్ కార్పొరేషన్‌లలో నిర్వహించే బడ్జెట్ సమావేశాలకు అనుమతించే మీడియాను నిజామాబాద్‌లో మాత్రం ఎందుకు సమావేశాలకు అనుమతించడం లేదని బీజేపీ కార్పొరేటర్లు ప్రశ్నించారు. మీడియాను అనుమతించే వరకు సమావేశం కొనసాగించ వద్దని కార్పొరేటర్లు మద్దతు తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా నిజామాబాద్‌లో మాత్రమే మీడియాను ఎందుకు అనుమతించడం లేదని సభ్యులు ఆందోళన చేపట్టారు. చివరికి బలవంతంగా మీడియాను పోలీసులతో బయటకు పంపించారు.


Similar News