షాపింగ్ మాల్స్ పై కేసులు నమోదు
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని షాపింగ్ మాల్స్ పై పలు కేసులు నమోదు చేసినట్లు జిల్లా తూనికల కొలతల అధికారి సుజాత్ అలీ తెలిపారు.
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని షాపింగ్ మాల్స్ పై పలు కేసులు నమోదు చేసినట్లు జిల్లా తూనికల కొలతల అధికారి సుజాత్ అలీ తెలిపారు. ప్యాకేజింగ్ కమాడిటీస్ యాక్టు ప్రకారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కిసాన్ ఫ్యాషన్ మాల్, ఎల్ వీఆర్ షాపింగ్ మాల్, బాంబే క్లాత్ హౌస్ లపై పలు కేసులు నమోదు చేశామని తూనికల కొలతల జిల్లా అధికారి పేర్కొన్నారు. ప్యాకేజీపై ఉన్న ప్రింట్ సమాచారం ఆధారాలు ప్యాకేజీ లోపల లేకపోవడం అతిక ధరలు ఇతర పలు అంశాలపై కేసులు నమోదు చేశామన్నారు.
ఫ్యాషన్ మాల్ యజమానులు ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించకూడదు అన్నారు. ఈ మూడు దుకాణాలకు జరిమానా విధించామన్నారు. బట్టల వ్యాపారులు ప్రభుత్వ రూల్స్ పాటించి వ్యాపారాలు చేయాలన్నారు. ప్యాకేజీ వస్తువులపై ఉన్న సమాచారం ప్యాకేజీ లోపల తప్పకుండా ఉండాలన్నారు. కిసాన్ ఫ్యాషన్ మాల్, ఎల్వీఆర్ షాపింగ్ మాల్, బొంబే షాపింగ్ మాల్ పై మొత్తం ఎనిమిది కేసులు నమోదు చేశామన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు బట్టల వ్యాపారులు బట్టల వ్యాపారం చేయాలన్నారు. ప్యాకేజింగ్ అండ్ కమాడిటీస్ యాక్ట్ పై కేసులు నమోదు చేసినట్లు జిల్లా అధికారులు తెలిపారు.