పోటాపోటిగా సాగుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకుల ప్రచారాలు..

ఎండాకాలం ప్రారంభం అవుతున్న సందర్భంలోనే ఎన్నికల వేడి కూడా రాజుకుంటోంది.

Update: 2023-04-11 11:18 GMT

దిశ, తాడ్వాయి : ఎండాకాలం ప్రారంభం అవుతున్న సందర్భంలోనే ఎన్నికల వేడి కూడా రాజుకుంటోంది. దాదాపు అన్ని పార్టీల దూకుడు పెంచకముందే, ఎన్నికలు ముందస్తు వస్తాయా లేదా అన్నవిషయం పక్కనపెడితే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు రాజకీయ పార్టీలు కసరత్తులు పూర్తిచేసుకుంటున్న తరుణంలో ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని తాడ్వాయి మండలంలో గతమూడు రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నువ్వానేనా అన్నట్టు పల్లెపల్లె కాంగ్రెస్ గడపగడపకు (మదన్మోహన్) vs (సుభాష్ రెడ్డి) హాథ్ సే హాథ్ జోడో పేరుతో ఎవరికీ వారే యమునా తీరే అన్నచందంగా మండలంలో ప్రచారం చేపడుతున్నారు.

టికెట్ల కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్కుంటునప్పటికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గాంధారిలో జరిగిన సభలో ఎల్లారెడ్డి నియోజకవర్గానికి ఎమ్మెల్యే టికెట్ పై చెప్పకనే చెప్పినట్లు సుభాష్ రెడ్డి పేరును ప్రస్థావించినప్పటికి మదన్మోహన్ రావు మాత్రం తగ్గేదే లేదు అనే విధంగా ఆయన ప్రయత్నాలు ఆయన చేసుకుంటూనె గ్రామాలల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచార కార్యక్రమలలో పాల్గొంటున్నారు. ఇదిలా ఉండగా మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఒక్కటే అయినప్పటికీ, మండల కేంద్రంలో పార్టీ కార్యాలయాలు మాత్రం ఎవరికీ వారే ఏర్పాటు చేస్కోవడంతో కాంగ్రెస్ పార్టీ వర్గీయూల్లో తీవ్రదుమారం రేగుతుంది. దీంతో మండలంలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ఎవరి నాయకునితో వారు ప్రచారాలలో బిజీబిజీ కొనసాగిస్తున్నారు.

Tags:    

Similar News