తాళం వేసిన ఇంట్లో చోరీ.. తులంన్నర వెండి, రూ.16 వేల నగదును ఎత్తుకెళ్లిన దొంగలు
ఆలూర్ మండలంలోని కల్లెడ గ్రామంలో తాళం వేసిన ఇంట్లో శనివారం (నిన్న)అర్ధరాత్రి చోరీ జరిగింది.
దిశ, ఆలూర్ : ఆలూర్ మండలంలోని కల్లెడ గ్రామంలో తాళం వేసిన ఇంట్లో శనివారం (నిన్న)అర్ధరాత్రి చోరీ జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. భజన మండలి గంగు శనివారం రాత్రి ఇంటికి తాళం వేసి ఆశ్రమానికి వెళ్ళింది. అది గమనించిన గుర్తుతెలియని దొంగలు ఇంటి తాళాలను పగులగొట్టి తులంన్నర వెండి, రూ.16 వేల నగదును ఎత్తుకెళ్లారు. కాగా బాధితులు మాక్లూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.