దళిత బందు లబ్ధిదారులకు బీఆర్ఎస్ నేతల బెదిరింపులు..
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలో అధికార బీఆర్ఎస్ పార్టి నేతల అగడాలు మితి మిరిపోయాయి.
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలో అధికార బీఆర్ఎస్ పార్టి నేతల అగడాలు మితి మిరిపోయాయి. దళితబంధు పైలట్ ప్రాజేక్ట్ మండలం ఐనా నిజాం సాగర్ మండలంలో దళితబంధు యూనిట్ల కేటాయింపులో చేతివాటంపై శనివారం దళితబంధు పథకంలో రాబంధుల పేరిట వచ్చిన కథనంతో బీఆర్ఎస్ నాయకులు బాధితులపై మండిపడ్డారు. నిజాంసాగర్ మండలం అచ్చంపేట్ గ్రామంలో దళితబంధు జాబితాలో పేరు వచ్చినప్పటికీ యూనిట్ కు కేటాయింపుకు లక్షలు డిమాండ్ చేసిన ఉదంతాన్ని మేతరి లక్ష్మీ అనే లబ్దిదారురాలు బహిర్గతం చేయడంపై బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డట్లు తెలిసింది.
మండల, ప్రాదేశీక నియోజకవర్గ నాయకులు, గ్రామ ప్రజాప్రతినిధులు దళిత లబ్దిదారులందరినీ ఏకం చేసి ఎవ్వరిని తాము డబ్బులు అడుగలేదని చెప్పాలని ఒత్తిడి చేసినట్లు తెలిసింది. ఇదే విషయంపై జుక్కల్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు తోట లక్ష్మీకాంతరావు బీఆర్ఎస్ నాయకులను హెచ్చరించారు. నిజాంసాగర్ మండలంలో దళితబంధును కేటాయించడానికి లక్షలు వసూల్ చేస్తున్నది బహిర్గతం చేస్తానని అన్నారు. ఇప్పటికే కళ్యాణలక్ష్మీకి సంబంధించిన వసూళ్లపై వివరాలు సేకరించామని తెలిపారు. దళితబంధు అక్రమాల గురించి బహిర్గతం చేసిన మేతరి లక్ష్మీ కుటుంబ సభ్యులను బెదిరిస్తే చూస్తు ఊరుకోమని అన్నారు. బీఆర్ఎస్ నాయకుల అవినీతి, అక్రమాలపై రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేస్తామని హెచ్చరించారు.