ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన పెంపొందించుకోవాలి

ఆర్థిక అక్షరాస్యతపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు.

Update: 2024-02-27 08:36 GMT

దిశ, కామారెడ్డి : ఆర్థిక అక్షరాస్యతపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలలో భాగంగా మంగళవారం స్థానిక కొత్త బస్టాండ్ నుండి ఇందిరా గాంధీ స్టేడియం వరకు నిర్వహించిన 2కే రన్ ను కలెక్టర్ ప్రారంభించారు. ఈ రన్ లో వివిధ బ్యాంకు ఉద్యోగులు, ఎన్​సీసీ, ఎన్​ఎస్​ఎస్​ విద్యార్థులు, పోలీసులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇందిరా గాంధీ స్టేడియం ఆవరణలో కలెక్టర్ మాట్లాడుతూ ఆర్థిక అక్షరాస్యతపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని, తద్వారా

    ఆర్థికంగా అభివృద్ధి చెందుటకు ఆస్కారం ఉంటుందన్నారు. అదే విధంగా బ్యాంకులు కల్పిస్తున్న వివిధ పొదుపు పథకాలు, చక్రవడ్డీ, రుణ సౌకర్యాలు, బ్యాంకు సేవలు, డిజిటల్ లావాదేవీలు, సైబర్ క్రైమ్ (ఆర్థిక నేరాల) బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తల పట్ల అవగాహన పెంపొందించుకోవాలన్నారు. ఈ దిశగా ప్రజలలో అవగాహన పెంపొందించేందుకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తున్న

    ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ భార్గవ్ సుధీర్, జాయింట్ మండల్ లెవెల్ బ్యాంకర్ల కమిటీ కన్వీనర్ రవి కుమార్, ప్రోగ్రాం అధికారులు చంద్రవెఖర్ గౌడ్, వెంకటేశ్వర్లు, ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్, డీసీసీబీ, ఆర్థిక అక్షరాస్యత కో ఆర్డినేటర్లు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. 


Similar News