పరీక్షల షాంపిళ్లు పంపుతున్నారా...?

వివిధ రకాల పరీక్షలకు సంబంధించి సేకరించిన షాంపిళ్ల ను టీ హబ్ కు రెగ్యులర్ గా పంపిస్తున్నారా...? అంటూ జిల్లా ప్రాథమిక వైద్యాధికారి డాక్టర్ లక్ష్మణ్ సింగ్ వైద్య సిబ్బందిని ప్రశ్నించారు.

Update: 2024-02-07 11:52 GMT

దిశ, భిక్కనూరు : వివిధ రకాల పరీక్షలకు సంబంధించి సేకరించిన షాంపిళ్ల ను టీ హబ్ కు రెగ్యులర్ గా పంపిస్తున్నారా...? అంటూ జిల్లా ప్రాథమిక వైద్యాధికారి డాక్టర్ లక్ష్మణ్ సింగ్ వైద్య సిబ్బందిని ప్రశ్నించారు. బుధవారం భిక్కనూరు మండల కేంద్రంలోని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా విజిట్ చేశారు. టీ హబ్ పై నిర్వహించిన సమీక్షా సమావేశం లో ఆయన మాట్లాడుతూ వివిధ సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రికి వచ్చే రోగులకు వివిధ రకాల టెస్టులు చేస్తున్నారా అని ప్రశ్నించడంతోపాటు,

    టెస్టు చేస్తే ఇప్పటివరకు కామారెడ్డి లో ఉన్న టీహబ్ సెంటర్ కు ఎన్ని రకాల షాంపిళ్లను పంపించారని వివరాలు అడిగి తెలుసుకున్నారు. చేసిన టెస్టులకు సంబంధించి రికార్డులను పరిశీలించిన ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని, అప్పుడే ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకం పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక వైద్యాధికారిని డాక్టర్ హేమీమా, ఫార్మసిస్ట్ వెంకటేశం, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 


Similar News