విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు

పిట్లం మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.

Update: 2024-02-24 12:17 GMT

దిశ, పిట్లం: పిట్లం మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా తోట లక్ష్మి కాంతారావు మాట్లాడుతూ… మండల స్థాయి లేవల్‌లో విధులు నిర్వహిస్తున్న అధికారులు విధులలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఆయన సూచించారు. మండల స్థాయి సర్వసభలో పాల్గొన్న ఆయన వివిధ శాఖలకు చెందిన అధికారులతో మాట్లాడుతూ జరుగుతున్న అభివృద్ధి పై సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యుత్ శాఖ శాఖ అధికారులకు సంబంధించిన అధికారులతో మాట్లాడుతూ ఎటువంటి విషయాలలో ఎవరి పై కేసులు చేయకూడదని ఆయన హెచ్చరించారు. అంతేకాకుండా వైద్య, ఐసీడీఎస్, ఐకేపీ, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో మాట్లాడుతూ… ఎలాంటి పనులు నిర్వహించినప్పటికీ చేయకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఆయన సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సదరు అధికారుల పై తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఇలాంటి ప్రతి మూడు నెలల కోసం నిర్వహిస్తున్న మండల సర్వసభ్య సమావేశం ప్రజల సమస్యలకు చేదోడు వాదోడుగా నిలుస్తుందని అలాంటి సమావేశానికి ఎవరు కూడా గైర్హాజరు కావద్దని ఆయన సూచించారు. ఇప్పటికైనా అధికారులు గత ప్రభుత్వంలో అవలంబించిన అలసత్వాన్ని వీడి మనస్ఫూర్తిగా విధులు నిర్వహించాలని ఆయన కోరారు. గ్రామంలో మండల స్థాయి అధికారులతో పాటు వివిధ శాఖలకు చెందిన అధికారులు, ఎంపీటీసీలు వార్డ్ మెంబర్లు, ఉన్నారు. ‌


Similar News