ఫిష్ ప్లాంటేషన్ ప్రారంభించిన కలెక్టర్

కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో రెండు ఫిష్ ప్లాంటేషన్ లను బుధవారం కలెక్టర్ జితేష్ పాటిల్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..

Update: 2023-02-15 06:28 GMT

దిశ, గాంధారి: కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో రెండు ఫిష్ ప్లాంటేషన్ లను బుధవారం కలెక్టర్ జితేష్ పాటిల్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎక్కడైనా పొలాల్లో ప్లాంటేషన్ చూస్తుంటాం కానీ ఇది కొత్త తరహా ఆలోచన ఇంటిపై ప్లాంటేషన్ నిర్మించుకోవడం నేటి యువత వినూత్న ప్రయత్నాన్ని అభినందించారు. ఈ ప్లాంటేషన్‌కు మహిళా గ్రామ సంఘం నుండి అర్హులైన వారికి బ్యాంకు నుండి కూడా లోన్ మంజూరు చేయడం జరుగుతుందని అన్నారు.

అంతేకాకుండా ఎనిమిది నెలల్లో చేప పిల్లలు కాస్త పెద్దవిగా చేపలుగా మారే తరుణంలో నీటిని మారుస్తున్నప్పుడు ఆ నీరును ఎట్టి పరిస్థితుల్లో డ్రైనేజీలో కలవనివ్వ కూడదని అన్నారు. అలాగే దీనికి సంబంధించి అదనంగా ఇంకొక మీటర్ తీసుకోవాలని, దాన వంటి కొనుగోలు చేసి చేప పిల్లలను పెంచేందుకు ఆసక్తి చూపుతున్న వారిని అభినందించారు. అలాగే మత్స్యకారులు, ఫిష్ ప్లాంటేషన్ వారికి మధ్య ఎలాంటి వాగ్వాదాలు లేకుండా చూడాలని కలెక్టర్ ప్రత్యేకంగా జిల్లా ప్రోగ్రామ్ అధికారికి సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఫిష్ ప్రోగ్రాం అధికారి, జడ్పిటిసి,ఎంపీపీ, సర్పంచ్, విడిసి సభ్యులు, డ్వాక్రా సంఘాల గ్రూప్ మహిళలు పాల్గొనడం జరిగింది.

Tags:    

Similar News