పదో తరగతిలో 100 శాతం ఉత్తీర్ణత సాధించాలి

పదో తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీ అన్నారు.

Update: 2024-02-21 10:51 GMT

దిశ,వాంకిడి : పదో తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీ అన్నారు. బుధవారం మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. పాఠశాలలో కొనసాగుతున్న ప్రహారీ గోడ నిర్మాణ పనులు, పూర్తైన అదనపు తరగతి గదులు, కిచెన్ షెడ్లను పరిశీలించా రు. అనంతరం పదో తరగతి విద్యార్థుల ప్రతిభను పరిశీలించారు.

     పదో తరగతి సిలబస్ పూర్తి చేసి వార్షిక పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయాలని ఉపాధ్యాయ సిబ్బందిని ఆదేశించా రు. అంతకుముందు గోయగాం గ్రామాన్ని సందర్శించి గ్రామంలో చేపట్టిన ఎంపీటీ పనులను పర్యవేక్షించారు. జాబ్ కార్డు కల్గిన ప్రతి ఒక్క కూలీకి ఉపాధి హామీ పనులు కల్పించాలన్నారు. వేసవికాలం నేపథ్యంలో గ్రామంలో నీటీ ఎద్దడి లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట ఎంపీడీవో వరలక్ష్మి, జీఎస్ ఏపీలో శ్రావణ్ కుమార్, టీఏ ఎఫ్ఏల ఉన్నారు. 


Similar News