Niranjan: కేటీఆర్‌కు మతి తప్పింది.. రాజీవ్‌పై విమర్శలు తగవు: టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ ఫైర్

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ డిమాండ్ చేశారు.

Update: 2024-08-20 14:24 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. రాజీవ్ గాంధీ దేశానికి విశిష్టమైన సేవలు అందించారని గుర్తు చేశారు. రాజీవ్ ముందుచూపు నిర్ణయాలు వల్లే నేడు దేశం సాంకేతిక రంగంలో అగ్రగామిగా నిలిచిందిని అన్నారు. దేశంలో సెల్‌ఫోన్ రాకకు కూడా ఆయనే కారణం అని అన్నారు. భారత్‌లో టెక్నాలజీ అభివృద్ధి, పంచాయతీ రాజ్ వ్యవస్థను పటిష్టం చేసేందుకు ఆయన చేసిన కృషి మరువలేనిదని అన్నారు. 18 ళ్ల వయస్సు గల యువతకు ఓటు హక్కు, వారికి ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం కల్పించి, దేశాభివృద్ధిలో పాల్గొనే అవకాశం కల్పించారని తెలిపారు. రాజీవ్ గాంధీ 1990‌లో జంట నగరాలలో జరిపిన సద్భావన యాత్ర, 1991లో మతకల్లోల బాధితులను ఇంటింకి వెళ్లి పరామర్శించిన విషయాన్ని తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మరువలేరని అన్నారు. జాతీయ నాయకుడైన రాజీవ్ గాంధీకి తెలంగాణకు ఏంటి సంబంధమని కేటీఆర్ వ్యాఖ్యానించడం ఆశ్చర్యకరంగా ఉందని మండిపడ్డారు. ఇది కేటీఆర్ అహంకారానికి నిదర్శనమని తెలిపారు.

Tags:    

Similar News