NHRC: సరోగసీ మహిళా ఆత్మహత్య ఘటనపై ఎన్ హెచ్ఆర్సీ సీరియస్.. వారిద్దరికి నోటీసులు

సరోగసీ మహిళా ఆత్మహత్య ఘటనపై ఎన్ హెచ్ఆర్సీ సీరియస్ అయింది.

Update: 2024-11-29 10:38 GMT
NHRC: సరోగసీ మహిళా ఆత్మహత్య ఘటనపై ఎన్ హెచ్ఆర్సీ సీరియస్..  వారిద్దరికి నోటీసులు
  • whatsapp icon

దిశ, డైనమిక్ బ్యూరో: సరోగసీ కోసం హైదరాబాద్ నగరానికి వచ్చిన మహిళ రాయదుర్గలో ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్  (NHRC) సీరియస్ అయింది. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా ఈ ఘటనను ఎన్ హెచ్ఆర్సీ సుమోటోగా విచారణకు స్వీకరించింది. రెండు వారాల్లో ఎఫ్ఐఆర్ స్టేటస్ తో సహా సమగ్ర నివేదిక ఇవ్వాలని తెలంగాణ సీఎస్, డీజీపీలకు కమిషన్ నోటీసులు జారీ చేసింది. రాష్ట్రంలో సరోగసీ పేరుతో మహిళలపై జరుగుతున్న వేధింపులకు సంబంధించి ప్రజల నుంచి ఏమైనా ఫిర్యాదులు వస్తే పోలీసు అధికారుల నుంచి కూడా కమిషన్ తెలుసుకోవాలన్నారు. సరోగసీ (surrogacy) పేరుతో మహిళలపై వేధింపులకు సంబంధించిన ఫిర్యాదులు ఏమైనా వస్తే వాటిని తెలపాలని కోరింది. కాగా ఒడిశాకు చెందిన ఓ మహిళను సరోగసీ కోసం రాజేశ్ బాబు (54) అనే వ్యక్తి నగరానికి గత నెల 24న రప్పించాడు. అప్పటి నుంచి రాయదుర్గం (Rayadurgam) మై హోమ్ భూజా అపార్ట్ మెంట్ లో 9వ అంతస్తులో ఆమెను నిర్భందించాడు. ఈ క్రమంలో సదరు మహిళపై లైంగికంగా వేధింపులకు గురి చేశాడు. రాజేశ్ వేధింపులు భరించలేకపోయిన ఆ మహిళ ఈ నెల 25న భవనం పై నుంచి దూకి సూసైడ్ చేసుకుంది.

Tags:    

Similar News