BRS తొలి విజయం అంటూ కేటీఆర్ ట్వీట్.. నెటిజన్ స్ట్రాంగ్ కౌంటర్

కృష్ణా జలాల వివాదం రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోంది. అటు ఆంధ్రా, ఇటు తెలంగాణ అసెంబ్లీల్లో ఇదే అంశంపై వాడివేడి చర్చలు జరుగుతున్నాయి.

Update: 2024-02-12 11:28 GMT

దిశ, వెబ్‌డెస్క్: కృష్ణా జలాల వివాదం రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోంది. అటు ఆంధ్రా, ఇటు తెలంగాణ అసెంబ్లీల్లో ఇదే అంశంపై వాడివేడి చర్చలు జరుగుతున్నాయి. సోమవారం తెలంగాణ అసెంబ్లీలో కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగింత విషయంలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఒకానొక దశలో వ్యక్తిగత విమర్శలు సైతం చేస్తున్నారు. చివరకు కృష్ణా ప్రాజెక్టుల‌ను కేఆర్ఎంబీకి అప్పగించ‌వ‌ద్దని ఇరిగేష‌న్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమ‌వారం ఉద‌యం స‌భ‌లో తీర్మానం ప్రవేశ‌పెట్టారు. ఈ తీర్మానంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

ఈ మేరకు ఎక్స్‌(ట్విట్టర్‌‌)లో ఒక ఆసక్తికరమైన ట్వీట్ పెట్టారు. ‘‘కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పచెప్పడానికి నిరసనగా రేపు నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన 'ఛలో నల్గొండ' సభ సృష్టించిన ఒత్తిడి వల్ల.. కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించట్లేమని నేడు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి ఇది తొలి విజయం’’ అని పేర్కొన్నారు. దీనికి ఓ నెటిజన్ స్పందిస్తూ కేటీఆర్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘‘ఆటో రాముడు.. డ్రామాలు మానడు’’ అని కామెంట్ కింద పోస్టు చేశారు.

Tags:    

Similar News