ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి
బస్సు ఢీకొని మహిళ మృతి చెందిన సంఘటన గురువారం మండల పరిధిలోని వల్లభాపురం గ్రామ శివారులో చోటుచేసుకుంది.
దిశ, చివ్వెంల : బస్సు ఢీకొని మహిళ మృతి చెందిన సంఘటన గురువారం మండల పరిధిలోని వల్లభాపురం గ్రామ శివారులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కృష్ణా జిల్లా పైడికొండ పాలెం గ్రామానికి చెందిన మెరికనపల్లి ఇందిర (45) హైదరాబాదులో ఉంటున్న కూతురు ఇంటికి వెళ్లడానికి విజయవాడ బెంజ్ సర్కిల్ లో బస్సు ఎక్కింది. హైదరాబాద్ వెళ్తుండగా మార్గమధ్యలో వల్లభాపురం గ్రామ శివారులో సాయి కృష్ణ హోటల్ వద్ద బస్ డ్రైవర్ తన బస్సును చార్జింగ్ పెట్టడానికి ఆపగా..ఇందిరా మూత్ర విసర్జనకు వెళ్లింది. ఈ క్రమంలో హైదరాబాద్ వైపు నుండి విజయవాడ వెళ్తున్న తణుకు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ బస్సును అతివేగం అజాగ్రత్తగా నడుపుకుంటూ..వచ్చి ఆమెకు ఢీ కొట్టాడు. దీంతో ఇందిర అక్కడికక్కడే మృతి చెందింది. అల్లుడు గడ్డం రత్నం ఫిర్యాదు మేరకు ఎస్సై మహేశ్వర్, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.