ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి

సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో జరుగుతున్న ఇందిరమ్మ ఇండ్ల సర్వే ను జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ గురువారం పరిశీలించారు.

Update: 2024-12-12 14:47 GMT

దిశ,కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో జరుగుతున్న ఇందిరమ్మ ఇండ్ల సర్వే ను జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ గురువారం పరిశీలించారు. సర్వే జరుగుతున్న తీరును, సర్వే వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి లబ్ధిదారుల ను ఎంపిక చేసేందుకు సర్వే జరుగుతున్నదని, ఈ సర్వే ను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమాలలో ఆర్ డీ హో సూర్యనారాయణ, తహశీల్దార్ వాజిద్ ఆలి, పలువురు రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.


Similar News