అధికారుల ఉదాసీనత ఎందుకు..?

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం లింగోజిగూడెం రెవెన్యూ పరిధిలోని గోల్డెన్ ఫారెస్ట్ ఇండియా లిమిటెడ్ సర్వే నెంబర్లలోని అక్షయ ఇన్ఫ్రా ప్రాపర్టీస్ భూములను నిషేధిత జాబితాలో నుంచి తొలగించారు.

Update: 2024-12-12 16:00 GMT

దిశ,చౌటుప్పల్ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం లింగోజిగూడెం రెవెన్యూ పరిధిలోని గోల్డెన్ ఫారెస్ట్ ఇండియా లిమిటెడ్ సర్వే నెంబర్లలోని అక్షయ ఇన్ఫ్రా ప్రాపర్టీస్ భూములను నిషేధిత జాబితాలో నుంచి తొలగించారు. దీనిపై దిశ బుధవారం ఆధారాలతో సహా కథనాన్ని బయటపెట్టింది. సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న గోల్డెన్ ఫారెస్ట్ ఇండియా లిమిటెడ్ భూములను నిషేధిత జాబితాలో నుంచి తొలగించేందుకు అధికారం లేకపోయినా మాజీ ఆర్డిఓ,అప్పటి కలెక్టర్లు నిషేధాన్ని ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

విచారణకే జంకుతున్న అధికారులు!

అక్షయ ఇన్ఫ్రా ప్రాపర్టీస్ పై లింగోజిగూడెం రెవిన్యూ లోని పలు సర్వే నెంబర్లు 10 ఎకరాల 36 గుంటల వ్యవసాయేతరా భూమిని నిషేధిత జాబితాలో నుండి అప్పటి జిల్లా కలెక్టర్ పమేల సత్పతి చౌటుప్పల్ మాజీ ఆర్డీవో సూరజ్ కుమార్ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా తొలగించింది.  2015 లో తిరస్కరించిన అదే సర్వే నెంబర్లలోని భూమిని 2021లో ఎలాంటి మార్పు లేకుండానే ఉన్నతాధికారులు తొలగించడం పట్ల దిశ ఆధారాలతో బహిర్గతం చేసింది. అయితే దీనిపై విచారణ చేసి చర్యలు తీసుకునేందుకు అధికారులు జంకుతున్నట్లు సమాచారం. గోల్డెన్ ఫారెస్ట్ ఇండియా లిమిటెడ్ లోని భూములను గత కలెక్టర్,ఆర్డిఓ క్లియర్ చేసినప్పుడు ప్రస్తుతం ఉన్న ఆర్డీవో కూడా ఇతరుల భూములను కూడా సర్వే చేపట్టి ఎందుకు నిషేధిత భూముల జాబితా నుండి తొలగించే చర్యలు చేపట్టడం లేదనే అభిప్రాయం స్థానికుల నుండి వ్యక్తం అవుతుంది. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇచ్చేందుకు అయినా ప్రస్తుతం ఉన్న అధికారులు గతంలో అధికారులు జారీ చేసిన క్లియరెన్స్ లపై విచారణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

కలెక్టర్ ఆదేశాల కోసం ఎదురుచూస్తున్న చౌటుప్పల్ ఆర్డిఓ!

గోల్డెన్ ఫారెస్ట్ ఇండియా లిమిటెడ్ నిషేధిత జాబితా నుండి తొలగించబడిన అక్షయ ప్రాపర్టీ పై దిశలో అక్షయ ప్రాపర్టీ పై ఎందుకు అంత ప్రేమ అనే పేరుతో వచ్చిన కథనంపై ఆర్డీవో విచారణ చేసేందుకు కలెక్టర్ ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నారు. దీనిపై దిశ ప్రతినిధి చౌటుప్పల్ ఆర్డిఓ శేఖర్ రెడ్డిని వివరణ కోరగా..ఉన్నతాధికారుల నుండి ఆదేశాలు వస్తే విచారణ చేస్తానని తెలిపారు. స్థానికంగా ఉన్న సమస్యలపై ఉన్నతాధికారులకు తెలియజేసి విచారణ చేయాల్సిన ఆర్డిఓ ఇలా సమాధానం చెప్పడం వెనక ఆంతర్యం ఏమిటని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు. స్థానికంగా ఉన్న సమస్యపై జిల్లా కలెక్టర్ కు నివేదించి అందుకు తదుపరి తీసుకోవాల్సిన చర్యల ఆదేశాలను కోరాల్సిన కిందిస్థాయి అధికారి ఇలా చెప్పడంతో..అక్షయ ఇన్ఫ్రా ప్రాపర్టీకి సహకరిస్తున్నారా అనే అనుమానం కలగక మానదు.


Similar News