యాదాద్రి భువనగిరి జిల్లాలో హర్యానా గవర్నర్ పర్యటన
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించనున్నారు.
దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11.30 గంటలకు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నర్సింహా స్వామి దేవస్థానంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 01.00 గంటలకు మండలంలోని కాచారం,ధర్మారెడ్డి గూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నోట్ పుస్తకాలు, స్టడీ కిట్లు పంపిణీ చేయనున్నారు. మధ్యాహ్నం 03.30 గంటలకు స్వర్ణగిరి ఆలయంలో పూజ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.