Minister Komati Reddy Venkata Reddy : విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలి

నల్లగొండ జిల్లాలో వేసవిని దృష్టిలో ఉంచుకుని విద్యుత్ సరఫరా లో ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటినుండే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రోడ్లు,భవనాలు,సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ( Minister Komati Reddy Venkata Reddy )ట్రాన్స్ కో అధికారులను ఆదేశించారు.

Update: 2024-10-29 14:17 GMT

దిశ,నల్లగొండ:నల్లగొండ జిల్లాలో వేసవిని దృష్టిలో ఉంచుకుని విద్యుత్ సరఫరా లో ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటినుండే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రోడ్లు,భవనాలు,సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ( Minister Komati Reddy Venkata Reddy )ట్రాన్స్ కో అధికారులను ఆదేశించారు.ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో.. ఎస్పీడీసీఎల్ పర్యవేక్షిక ఇంజనీర్ వెంకటేశ్వర్లు, ఇతర విద్యుత్తు అధికారులతో విద్యుత్ అంశాలపై సమీక్ష నిర్వహించారు. వేసవిలో విద్యుత్ సమస్యలను అధిగమించేందుకు నల్గొండ పట్టణంతో పాటు.. నల్గొండ గ్రామీణంలో అవసరమైన సబ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సమర్పించాలని మంత్రి ఆదేశించారు. అంతేకాకుండా విద్యుత్తు ఓవర్లోడ్ సమస్య లేకుండా చూసేందుకు అవసరమైన అదనపు ట్రాన్స్ఫార్మర్లను సైతం ఏర్పాటు చేయాలని, అలాగే ఎక్కడైనా అనుకోకుండా విద్యుత్ సమస్య తలెత్తితే తక్షణమే విద్యుత్తు సరఫరా చేసే విధంగా సంచార ట్రాన్స్ఫార్మర్లను సైతం సిద్ధంగా ఉంచాలని తెలిపారు. ఇందుకు అవసరమైన ఇతర సామాగ్రి, బడ్జెట్ పై అంచనాలు రూపొందించి తక్షణం తనకు సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు. మంత్రి తన క్యాంపు కార్యాలయంలోనే ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. కాగా వ్యక్తిగత విషయాలు, ఆరోగ్యపరమైన అంశాలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని తమ సమస్యలు తీర్చాలని కోరుతూ.. ప్రజలు మంత్రికి ఫిర్యాదులను సమర్పించారు. విద్యుత్ శాఖ డిప్యూటీ ఇంజనీర్ నవీద్, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు.


Similar News