ప్రజా పాలన కాదు.. దొరల పాలన నడుస్తోంది : సూది రెడ్డి నరేందర్ రెడ్డి
రాష్ట్రంలో నడిచేది ప్రజా పాలన కాదని దొరల పాలన నడుస్తోందని జిల్లా
దిశ, నార్కట్ పల్లి : రాష్ట్రంలో నడిచేది ప్రజా పాలన కాదని దొరల పాలన నడుస్తోందని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్ రెడ్డి, నార్కట్ పల్లి మండల మాజీ ఎంపీపీ సూది రెడ్డి నరేందర్ రెడ్డిలు విమర్శించారు. ఈనెల 29వ తేదీన జరిగే దీక్ష దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. నార్కట్ పల్లి పట్టణంలోని ఓ ప్రైవేటు హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ విధంగా మాట్లాడారు. ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయిందని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు ఖాయమన్నారు. చెప్పిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా కేవలం మాటల గారడితోనే కాలం వెల్లదీస్తున్నారని మండిపడ్డారు.
ఒక్కో రోజు ఒక్కో విధంగా డ్రామాలు ఆడుతూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. హైడ్రా పేరిట కోట్ల రూపాయలను దోచుకొని అమాయకుల పొట్ట గొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. పోరాడి సాధించిన తెలంగాణలో మాజీ సీఎం కేసీఆర్ ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేసే వరకు ప్రజల పక్షాన పోరాడుతామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ పుల్లెంల ముత్తయ్య, మాజీ సర్పంచులు మల్గ బాలకృష్ణ, కొత్త నరసింహ, కృష్ణ, ఎల్లయ్య, చెరువుగట్టు మాజీ డైరెక్టర్ మేక వెంకట్ రెడ్డి, చిట్యాల రవిచంద్ర, వడ్డేపల్లి నాగరాజు, జానీ, రామలింగం, పెరుమాళ్ళ రవి తదితరులు పాల్గొన్నారు.