బాధితులను ఆదుకుంటాం : ఎమ్మెల్యే పద్మావతి

ప్రకృతి వైపరీత్యంతో భారీ వర్షాలతో వచ్చిన వరదల వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకుంటామని కోదాడ శాసన సభ్యురాలు ఎన్.ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు.

Update: 2024-09-04 13:10 GMT

దిశ , కోదాడ : ప్రకృతి వైపరీత్యంతో భారీ వర్షాలతో వచ్చిన వరదల వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకుంటామని కోదాడ శాసన సభ్యురాలు ఎన్.ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. భారీ వర్షాల కారణంగా కోదాడ మున్సిపాల్టీ 34వ వార్డు లో మృతి చెందిన నాగం మురళీకృష్ణ భార్య నాగం రోజాకి, 31వ వార్డు కి చెందిన యరమళ్ల వెంకటేశ్వర్లు భార్య ఈశ్వరమ్మకి చెరో 5 లక్షల రూపాయల చెక్కులను ఆమె జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తో కలిసి కోదాడ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అందజేశారు.

     అనంతరం మాట్లాడుతూ కుటుంబ పెద్ద వరదలలో మరణించటం దురదృష్టకరం అన్నారు. కుటుంబ సభ్యులకు మనో ధైర్యాన్ని కల్పించారు. అంతకుముందు కోదాడ నియోజకవర్గంలో వరదల వల్ల తెగిపోయిన రోడ్లు , చెరువులు, కాల్వలు, మునిగిన పంటలపై అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశంనిర్వహించారు. అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి అంచనాలు వేచి రేపు సాయంత్రంలోపు నివేదికలు అందజేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సూర్యనారాయణ, మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని ప్రమీల, వైస్ చైర్మన్ కోటేశ్వరరావు, కమిషనర్ రమాదేవి, కౌన్సిలర్ లు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Tags:    

Similar News