ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య పెంచుతాం

Update: 2024-08-30 12:31 GMT

దిశ, చౌటుప్పల్ : ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు ప్రపంచంలోనే పెద్ద స్థాయిలో ఉన్నారని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలోని తంగడపల్లి ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న మోటే సత్తయ్య పదవీ విరమణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కోమటిరెడ్డి రాజ్ గోపాల్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం మోటె సత్తయ్య దంపతులను సన్మానించారు. మంచి పని చేసే వాళ్లను మంచి మనుషులను గౌరవించుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని దాంట్లో భాగంగానే ఈ కార్యక్రమానికి హాజరయ్యానని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతున్న విషయంపై ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని, ప్రభుత్వము అనుకుంటే ఇది సాధ్యపడదని ప్రతి ఒక్కరు విద్యార్థుల సంఖ్య పెంచడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. మునుగోడు నియోజకవర్గంలో విద్య, వైద్యానికి మా మొదటి ప్రాధాన్యతని ప్రభుత్వంతో మాట్లాడి సరిపడా నిధులు తీసుకొచ్చి పాఠశాలల్లో మౌలిక వసతులను అభివృద్ధి చేస్తానన్నారు. 


Similar News