సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

దేవరకొండ నియోజకవర్గం కొండమల్లేపల్లి పట్టణంలో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గర్ల్స్ పాఠశాల/కళాశాలను జిల్లా కలెక్టర్ త్రిపాఠి ఆకస్మికంగా తనిఖీ చేశారు

Update: 2024-11-23 13:19 GMT

దిశ ,కొండమల్లేపల్లి : దేవరకొండ నియోజకవర్గం కొండమల్లేపల్లి పట్టణంలో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గర్ల్స్ పాఠశాల/కళాశాలను జిల్లా కలెక్టర్ త్రిపాఠి ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంటగదితో పాటు పాఠశాల పరిశుభ్రంగా ఉండాలని ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాల్సిన బాధ్యత సంబంధిత ప్రిన్సిపల్స్ పై ఉందని అన్నారు. పాఠశాల నిర్వహణ పట్ల నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రిజిస్టర్ల నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోసారి ఇలాంటి తప్పులు జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.హెల్త్ సూపర్వైజర్ వస్తున్నారా..విధులకు సరిగ్గా వస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ మహ్మద్ ఆన్వర్ తదితరులు పాల్గొన్నారు. 


Similar News