గ్రామపంచాయతీ కార్మికులకు వేతనాలు పెంచాలి
గ్రామపంచాయతీలలో పనిచేసే కార్మికుల వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పెంచాలని సిఐటియు జిల్లా నాయకులు జిట్ట నగేష్ అన్నారు.
దిశ, చిట్యాల: గ్రామపంచాయతీలలో పనిచేసే కార్మికుల వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పెంచాలని సిఐటియు జిల్లా నాయకులు జిట్ట నగేష్ అన్నారు. శుక్రవారం చిట్యాల పట్టణ కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో..నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పంచాయతీ కార్మికులకు పెండింగ్ బకాయిలను చెల్లించడంతోపాటు అర్హత కలిగిన కార్మికులను పర్మినెంట్ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం మండల పరిషత్ సూపరిండెంట్ మనోహర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు అవిశెట్టి శంకరయ్య, పట్టణ కార్యదర్శి బొబ్బిలి సుధాకర్ రెడ్డి, బీఎస్పీ నాయకులు మారయ్య డివైఎఫ్ఐ నాయకులు వడ్డగాని మహేష్, మహంకాల బాలమ్మ, సిర్పంగి యాదయ్య వలిగొండ, లింగయ్య, గుర్రం లింగస్వామి లు హాజరై మద్దతు తెలిపారు.