'బంగారు తెలంగాణ ఎప్పుడో..?'.. అర్ధం కావడం లేదు : చెరుకు సుధాకర్
'బంగారు తెలంగాణ ఎప్పుడో..?'.. అర్ధం కావడం లేదని టీపీసీసీ ఉపాధ్యక్షులు చెరుకు సుధాకర్ అన్నారు.
దిశ, నల్లగొండ: 'బంగారు తెలంగాణ ఎప్పుడో..?'.. అర్ధం కావడం లేదని టీపీసీసీ ఉపాధ్యక్షులు చెరుకు సుధాకర్ అన్నారు. విశ్వంలో వింతైన 'నీడ లేని రోజు నేడు తెలంగాణ ప్రజలు గమనిస్తున్న "నిర్బంధపు నీడ లేని రోజు" అన్నారు. 4 ఏండ్లు ప్రమోషన్ కాలం అయిపోయి.. రెగ్యులర్ చేయండిని జూనియర్ పంచాయతీ సెక్రటరీలు సమ్మెకు దిగితే.. వారి సమస్య పరిష్కరించకపోగా ఉద్వాసన వేటుతో బెదిరిస్తూ నిర్భందం అమలు చేస్తున్నదని.. ప్రభుత్వంపై మండిపడ్డారు.
తెలంగాణ ప్రభుత్వం దళిత బంధులో లబ్ధిదారుల దగ్గర నుండి 3 లక్షలు ఏ ఏ MLA తీసుకున్నాడో నా దగ్గర లిస్టు ఉన్నదన్న కేసీఆర్ ప్రకటనను రుజువు చేస్తూ.. నల్లగొండ జిల్లాలో ఉన్న జరిగిన అవినీతిని లాంచగొండితనాన్ని ప్రసారం చేస్తే.. హెచ్‌ఎమ్ టీవీ నల్లగొండ న్యూస్ కో ఆర్డినేటర్ బబ్బూరి అశోక్ గౌడుపై నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆయన అనుచరులు, దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర నాయక్ ఆయన అనుచరులు పలు స్టేషన్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు బుక్ చేయించిన తీరును తీవ్రంగా ఖండించారు.
అక్రమంగా పెట్టిన కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలి అని తప్పుడు కేసులు నమోదు చేయొద్దని, అది సమాజానికి మంచిది కాదన్నారు. జర్నలిస్టులపై కేసులు పెడుతూ.. మరోవైపు కేటీఆర్ దళితబంధు కోసం ఒక్క రూపాయి లంచం ఇవ్వొద్దు అంటే ఎట్లా అర్ధం చేసుకోవాలన్నారు. ప్రజలు తప్పక ప్రభుత్వానికి గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.