నేటి బాలలే రేపటి పౌరులు : మిర్యాలగూడ ఎమ్మెల్యే

నేటి బాలలే రేపటి పౌరులని, దేశ భవిష్యత్తు మార్గదర్శకాలని మిర్యాలగూడ

Update: 2024-11-14 11:46 GMT

దిశ, మిర్యాలగూడ : నేటి బాలలే రేపటి పౌరులని, దేశ భవిష్యత్తు మార్గదర్శకాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం అడవిదేవులపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వాతంత్ర్య సమరయోధులు, మాజీ ప్రధాని స్వర్గీయ జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఏర్పాటుచేసిన బాలల దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. నెహ్రూ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ నెహ్రూ కి పిల్లలు అంటే చాలా ఇష్టమని నేటి బాలలే రేపటి పౌరులు అనే లక్ష్యంతో పిల్లల అభివృద్ధి కోసం అనేక సంస్కరణలు అమలు చేశారని అన్నారు. ఆయన కుటుంబం అంతా ప్రజల కోసం, దేశం కోసం త్యాగం చేశారని అన్నారు.. వారిని ఆదర్శంగా తీసుకొని పిల్లలు అందరూ ఉన్నత చదువులు చదివి దేశానికి సేవలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్, సీనియర్ నాయకుడు స్కైలాబ్ నాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొదిల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


Similar News