కార్పొరేట్‌కు ధీటుగా గురుకులాల్లో విద్యా బోధన..

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల్లో

Update: 2024-11-14 14:18 GMT

దిశ, నడిగూడెం: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల్లో, బీసీ, మైనార్టీ వెల్ఫేర్ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయిలో విద్యా బోధనను పేద విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తూ వారి అభ్యున్నతి పాటు పడుతుందని కోదాడ, తుంగతుర్తి ఎమ్మెల్యే లు ఉత్తమ్ పద్మావతి, మందుల సామేలు పేర్కొన్నారు. నడిగూడెం మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో గత మూడు రోజులుగా జరిగిన పదో జోనల్ స్పోర్ట్స్ మీట్ ముగింపు కార్యక్రమంలో గురువారం వారు పాల్గొని మాట్లాడారు. గురుకులాలను బలోపేతం చేయడంలో భాగంగానే ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని వారు తెలిపారు.

ఈ ఇంటిగ్రేటెడ్ పాఠశాలల ఏర్పాటుతో ఓకే ప్రాంతంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ చదువుకునే వీలు కలుగనుందని వారు చెప్పారు. గురుకుల విద్య అభివృద్ధికి ప్రత్యేక పథకాలను ప్రవేశపెట్టి విద్యార్థుల అభ్యున్నతికి పాటు పడుతున్నట్లు పేర్కొన్నారు. డైట్, కాస్మోటిక్ చార్జీల పెంపుకు కృషి చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. గురుకుల విద్యను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. అనుకున్న లక్ష్యాల చేధనలో గురుకుల విద్యార్థులు ముందున్నారని, కలెక్టర్లు, ఎస్పీ, డాక్టర్లు, ఇంజనీర్లు, సమాజంలో ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దే ఉపాధ్యాయులుగా తయారు కావాలన్నారు. నడిగూడెం లో రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ మీట్ ఏర్పాటు చేసేందుకు సొసైటీ అధికారులతో మాట్లాడుతామని తెలిపారు. రాష్ట్రస్థాయిలో కూడా విజయాలను సాధించాలని ఆకాంక్షించారు. జోనల్ స్థాయిలో గెలుపొందిన విద్యార్థులను బహుమతులను ప్రధానం చేసి అభినందించారు.

క్రీడల నిర్వహణ పట్ల సంతృప్తిని వ్యక్తం చేసిన ఎమ్మెల్యే లు జోనల్ ఆఫీసర్, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులను వారు అభినందించారు. ఈ సందర్భంగా ఇరువురు ఎమ్మెల్యేలను జోనల్ ఆఫీసర్, ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు పట్టు శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జోనల్ ఆఫీసర్ విద్యా రాణి, డిసిఒ విద్యాసాగర్, ప్రిన్సిపాల్ సిహెచ్. వాణి, ప్రిన్సిపాల్ ఝాన్సీ, పద్మ, అరుణకుమారి, వెంకటేశ్వర్లు, వైస్ ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీపీ యాతాకుల జ్యోతి మధుబాబు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోత్కూరి వెంకటరెడ్డి, మాజీ జడ్పీటీసీ బాణాల కవిత నాగరాజు, మాజీ సర్పంచి గడ్డం నాగలక్ష్మి మల్లేష్ యాదవ్, మాజీ వైస్ ఎంపీపీ బడేటి వెంకటేశ్వర్లు యాదవ్ , పేరెంట్స్ కమిటీ జిల్లా అధ్యక్షుడు నరసయ్య, పాఠశాల అధ్యక్షుడు బాణాల నాగరాజు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


Similar News