తెలంగాణ గడ్డ మీద పార్టీ బలోపేతమే లక్ష్యం : నన్నూరి

తెలంగాణ గడ్డ మీద తెలుగుదేశం పార్టీ బలోపేతమే

Update: 2024-11-14 12:35 GMT

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : తెలంగాణ గడ్డ మీద తెలుగుదేశం పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తానని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి, టీటీడీ పాలకవర్గ సభ్యుడు నన్నూరి నర్సిరెడ్డి అన్నారు. గురువారం యాదగిరిగుట్టలో జరిగిన ఆలేరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సభ్యత నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నర్సిరెడ్డి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల పునాదుల మీద నిర్మితమైన తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో పునర్వైభవం కల్పించడానికి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. రాష్ట్ర, మండల, గ్రామ స్థాయిలో కమిటీలు పునర్నిర్మాణం చేసి ప్రజా సమస్యలపై ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడుతున్నారు. తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లోకి వచ్చాక గ్రామాల్లో మౌళిక సదుపాయాలు వచ్చాయన్నారు.

టీటీడీ బోర్డు మెంబర్ గా అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఈ ప్రాంతంలోని అన్ని దేవాలయాలు సందర్శించి దేవాలయాల ఆస్తులు భూములు పరిరక్షించే బాధ్యత తీసుకుంటామన్నారు. టీటీడీ పాలక వర్గ సభ్యునిగా భక్తులకు మెరుగైన సేవలు అందేలా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పొలిట్ బ్యూరో సభ్యులు బక్కని నర్సింహులు, భువనగిరి పార్లమెంటరీ పార్టీ హాడ్ హాక్ కమిటీ కన్వీనర్ కృష్ణాచారి, ఆలేరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ రేగు బాల్ నరసింహ, నాయకుల రాముని హరీష్, మచ్చ నరసింహ గౌడ్, కళ్లెం బాబురావు, చిత్తర్ల శ్రీనివాస్, ముకర్ల శ్రీశైలం, అనంతల నరసింహారెడ్డి, గుండా భాస్కర్, పొలాస వెంకన్న, గడ్డం అంజయ్య, కొర్నే బాబురావు, రాచర్ల నరసింహులు, భోగ సంతోష్, ఎడపల్లి సత్తయ్య, సీస రాజు గౌడ్, ఆకుల పద్మ, అండాలు, గుర్రం వసంత తదితరులు పాల్గొన్నారు.


Similar News