సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి : నల్లగొండ కలెక్టర్

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుటుంబ సమగ్ర సర్వే ను ఎన్యుమరేటర్

Update: 2024-11-14 14:13 GMT

దిశ, చిట్యాల : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుటుంబ సమగ్ర సర్వే ను ఎన్యుమరేటర్ పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సిబ్బందిని ఆదేశించారు. గురువారం చిట్యాల మున్సిపల్ కేంద్రంలో జరుగుతున్న సర్వేను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కేంద్రంలోని 4వ, 10వ వార్డులో ఎన్యూమరేటర్ నిర్వహిస్తున్న సర్వేను ఆమె స్వయంగా పరిశీలించారు. సర్వేకు సంబంధించిన అంశాలపై ఎన్యూమరేటర్ రికార్డులలో నమోదు చేయాలన్నారు. కుటుంబ సమగ్ర సర్వే రాష్ట్రంలోనే నల్లగొండ జిల్లా ప్రథమ స్థానంలో ఉందని, ఎన్యుమరేటర్లు మరికొంత సమయం తీసుకోనైనా సర్వేను పకడ్బందీగా పూర్తి చేయాలని సూచించారు. సర్వే పూర్తి చేసిన రికార్డులను భద్రంగా భద్ర పరచాలన్నారు. ఈ కార్యక్రమంలో తాసీల్దార్ కృష్ణ నాయక్, మున్సిపల్ కమిషనర్ వీరేందర్, సిబ్బంది పాల్గొన్నారు.


Similar News