నేడు యాదాద్రిలో పంచ కుండాత్మక మహా యాగానికి అంకురార్పణ
దిశ, యాదగిరిగుట్ట: యాదాద్రి పుణ్యక్షేత్రంలో పంచ నారసింహుల ఆల
దిశ, యాదగిరిగుట్ట: యాదాద్రి పుణ్యక్షేత్రంలో పంచ నారసింహుల ఆలయ మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా నిర్వహించనున్న పంచకుండాత్మక మహా యాగానికి బాలాలయంలోని యాగశాలలో పంచకుండాలను సిద్ధం చేశారు. పాంచరాత్ర ఆగమశాస్త్రను ప్రకారం ఈ యాగం నిర్వహించనుున్నారు.
మొదటిరోజు నిర్వహించు పూజా కార్యక్రమాలు
ఉదయం 9 గంటలకు స్వస్తివాచనంతో ప్రారంభం, విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, పంచగవ్య ప్రాశనం, అఖండ జ్యోతి ప్రజ్వలన, వాస్తు ఆరాధనలు.. మొదలగు పూజలు. బాలలయంలో చేశారు.
యాదాద్రిలో అద్భుతఘట్టానికి అంకురార్పణ
ప్రముఖ దివ్యక్షేత్రం యాదాద్రి ఉద్ఘాటన పర్వం కన్నులపండువగా మొదలైంది. నేటి నుంచి ఈనెల 28 వరకు యజ్ఞయాగాదులతో యాదాద్రి మార్మోగనుంది. మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా పంచకుండాత్మక మహాయాగానికి రుత్వికులు శ్రీకారం చుట్టారు. ఆగమశాస్త్రానుసారం పంచకుండాత్మక మహాయాగానికి అంకురార్పణ జరిపారు. బాలాలయంలో అష్టోత్తర శతఘటాభిషేక మహారాజాభిషేకం నిర్వహిస్తున్నారు.
పాంచరాత్ర ఆగమశాస్త్రం ప్రకారం పంచకుండాత్మక మహాయాగం జరుపుతున్నారు. బాలాలయంలోని యాగశాలలో పంచకుండాలు సిద్ధం చేసి క్రతువను ప్రారంభించారు. తొలిరోజు స్వస్తివాచనంతో ప్రారంభమైన యాగం.. ఏడురోజుల పాటు 108 మంది పండితుల చేతుల మీదుగా క్రతువును నిర్వహిస్తారు. ఇవాళ విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, పంచగవ్య ప్రాశనం, అఖండజ్యోతి ప్రజ్వలన, వాస్తు ఆరాధనలు జరుపుతారు.
సాయంత్రం మృత్సగ్రహణం, అంకురార్పణ, యాగశాల ప్రవేశం, కుంభస్థాపన, అష్టదిక్పాలకుల ప్రతిష్టాపన పర్వం ఉంటుంది. యాదాద్రిలో ఉత్సవాలకు అంకురార్పన.. యాదాద్రిలో స్వాతినక్షత్రం పురస్కరించుకుని స్వామివారికి 108 కలశాలతో అష్టోత్తర శత ఘటాభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామి వారి నిత్య పూజా కైంకర్యాలు చేపట్టి, బాలాలయ ముఖ మండపంలో తూర్పు అభిముఖంగా సువర్ణ మూర్తులను అధిష్టింపజేశారు. మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా స్వయంభువుల అనుమతి నిమిత్తం ఉదయం 9.35 గంటలకు ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహామూర్తి, ఆలయ ఈవో గీత, ప్రధానాలయంలోకి వెళ్లారు.