సామాజిక న్యాయానికి ఇదొక పెద్దపీట

మహాత్మ జ్యోతిరావు పూలే సతీమణి సావిత్రిబాయి పూలే జయంతిని"మహిళ ఉపాధ్యాయ దినోత్సవం"గా జరపాలంటూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం చారిత్రాత్మక విషయమని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ అన్నారు.

Update: 2025-01-03 14:20 GMT

దిశ, తుంగతుర్తి: మహాత్మ జ్యోతిరావు పూలే సతీమణి సావిత్రిబాయి పూలే జయంతిని"మహిళ ఉపాధ్యాయ దినోత్సవం"గా జరపాలంటూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం చారిత్రాత్మక విషయమని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ అన్నారు. తుంగతుర్తి మండల కేంద్రంలో శుక్రవారం సావిత్రిబాయి విగ్రహానికి పూలమాలలు వేసి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తుందనడానికి ఇదొక ఉదాహరణగా చెప్పుకోవచ్చని అన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు దొంగరి గోవర్ధన్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకన్న,నాయకులు దాసరి శ్రీను,కలకోట్ల మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.


Similar News