అందరూ పెరుగుతున్నారు.. నువ్వు తప్ప...
సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ నల్లగొండ జిల్లా కలెక్టరేట్ ముందు 27వ రోజు సమ్మె కొనసాగింది.
దిశ, నల్లగొండ : సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ నల్లగొండ జిల్లా కలెక్టరేట్ ముందు 27వ రోజు సమ్మె కొనసాగింది. సమ్మెలో భాగంగా ఈరోజు బజ్జీలు వేసి మా బతుకులు మార్చండి అని నిరసన తెలిపారు. అందరూ పెరుగుతున్నారు.. నువ్వు తప్ప అని సమగ్ర శిక్ష ఉద్యోగులు ఒక కార్టూన్ తో వినూత్నమైన నిరసన తెలిపారు. రోజు వారీగా నిత్యావసర వస్తువులు, ఉల్లిపాయలు, పెట్రోల్ పెరుగుతుంది కానీ సమగ్ర శిక్ష ఉద్యోగుల జీతాలు పెరుగడం లేదు అని జిల్లా అధ్యక్షులు మొలుగూరి కృష్ణ అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శులు బొమ్మగాని రాజు మాట్లాడుతూ మీడియా ముఖంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమగ్ర శిక్ష ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వ పథకమని దాటవేత ధోరణితో మాట్లాడుతున్నారని ఎన్నికల ముందు మా వ్యవస్థపై పూర్తి అవగాహన ఉన్నది. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో నే మా పరిష్కరిస్తానని మాట ఇచ్చి ఇప్పుడు మాట మారుస్తున్నారని ఇది ఎంతవరకు న్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. కస్తూర్బా గాంధీ, మండల విద్యా వనరుల కేంద్రం, భవిత సెంటర్, జిల్లా స్థాయి, పాఠశాల స్థాయి, కాంప్లెక్స్ స్థాయిలో బోధన, విద్యా సంబంధ అనేక రకాల పనులు నిలిచిపోయాయని, తక్షణమే విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని తక్షణమే పేస్కేల్ లేదా బేసిక్ పే అమలు చేసి సమగ్ర శిక్ష ఉద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
27 రోజులుగా వివిధ రూపాల్లో నిరసనలను తెలియజేస్తున్న సరైన స్పందన లేకుండా బెదిరింపు ధోరణిలో ప్రజాప్రతినిధులు మరియు అధికారులు ఈ విధంగా స్పందించడం బాధాకరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు కంచర్ల మహేందర్, క్రాంతి కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ కొండ చంద్రశేఖర్, ఎమ్ నీలాంబరి, మహిళా అధ్యక్షురాలు గుమ్మల మంజులారెడ్డి, మహిళా కార్యదర్శి మేడి సావిత్రి, అసోసియేట్ ప్రెసిడెంట్ వి.సావిత్రి, కోశాధికారి పాలడుగు పుష్పలత, సాయిలు, ఉపాధ్యక్షులు వెంకట్, జి వెంకటేశ్వర్లు, ఎర్రమల్ల నాగయ్య, ప్రచార కార్యదర్శి చందపాక నాగరాజు, బంటు రవి, లలిత, కొండయ్య, యాదయ్య, యాట వెంకట్, జి వెంకటేశ్వర్లు, ధార వెంకన్న, దారం శ్రీనివాస్, ఇటికాల రమేష్, వసంత, సుజాత, మంగ నిరంజన్, చెరక వెంకటకృష్ణ, వేముల నాగయ్య, సుంకోజు భిక్షం, రాగిపని బిక్షమా చారి, మొయిజ్ ఖాన్, నర్సింగోజు జానకి రాముల, అజీమ్ బాబా, పరమేశ్, నాగభూషణం చారి, రహీం, పాండు నాయక్, కారింగు జానయ్యా, జెల్ల చంద్రమౌళి, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.