భువనగిరికి రూరల్ సర్కిల్ ఆఫీస్..

యాదాద్రి భువనగిరి జోన్ పరిధిలోని భువనగిరి రూరల్ సర్కిల్ కార్యాలయాన్ని భువనగిరి పట్టణంలో ఏర్పాటు చేశారు.

Update: 2025-01-07 07:52 GMT

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జోన్ పరిధిలోని భువనగిరి రూరల్ సర్కిల్ కార్యాలయాన్ని భువనగిరి పట్టణంలో ఏర్పాటు చేశారు. ఇన్ని రోజులు భువనగిరి రూరల్ సీఐ కార్యాలయం బీబీనగర్ పోలీస్ స్టేషన్ లో ఉండేది. ఆ సమయంలో భువనగిరి రూరల్ సీఐ ఆఫీస్ పరిధిలోకి భువనగిరి రూరల్, బొమ్మలరామారం, బీబీనగర్ పోలీస్ స్టేషన్లు ఉండేవి. అయితే ఇటీవల బీబీనగర్ పీఎస్ ను ఇన్‌స్పెక్టర్ స్థాయికి అప్ గ్రేడ్ చేశారు. దీంతో భువనగిరి రూరల్ సీఐ పరిధిలో భువనగిరి రూరల్, బొమ్మలరామారం పీఎస్ లు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ కార్యాలయాన్ని భువనగిరి రూరల్ పీఎస్ పక్కన ఉన్న బిల్డింగ్ లో ఏర్పాటు చేశారు. ఈ కార్యాలయాన్ని గత మూడు రోజుల క్రితం రాచకొండ సీపీ సుధీర్ బాబు సందర్శించారు.‌ సీఐ చంద్రబాబుతో మాట్లాడి పలు సూచనలు చేశారు.


Similar News